'Baboy Phone' New Telugu Story Written By Kolla Pushpa రచన: కొల్లా పుష్ప (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నాన్నా! దీన్ని సెల్ఫోన్ అంటారు. మనము ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఇందులో స్పీడు డయల్ కూడా ఉన్నది. ఒకటి నొక్కితే నా ఫోన్ రింగ్ అవుతుంది. రెండు నెంబర్ నొక్కితే అక్కకు వెళుతుంది. మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడొచ్చు. నెంబర్లు నోట్ చేసి పుస్తకంలో రాశాను చూసి చేసుకోండి" అని సెల్ ఫోన్ ఎలా వాడాలో తండ్రి కి చెప్పి కొడుకు మూర్తి సూట్ కేస్ పట్టుకొని