top of page

తెలుగు భాషా దినోత్సవం(29/08/2021)

  • Writer: Neeraja Prabhala
    Neeraja Prabhala
  • Aug 30, 2021
  • 2 min read


'Telugu Bhasha Dinotsavam' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

మర్మమెరుగని, మచ్చ లేని మాత్రృ భాష -

మమతలెరిగిన , మధువు లొలికే మన తెలుగు భాష.

సుగంధ పూతోటలో వికసించిన పుష్పమై,

మది లోని భావాలకు తెలుగు భాషా సౌరభం రంగరించి,

ప్రేమ సౌభ్రాత్రృత్వం తో,

దేశ ఔన్నత్యాన్ని పెంచుతూ,

ప్రేమామ్రృతాన్ని పంచుతూ,

ఆ మథువు లోని మాథుర్యాన్ని గ్రోలుతూ,

కామ ధేనువు లాంటి తెలుగు తల్లి క్షీరామ్రృతాన్ని గోవత్సలై త్రాగుచూ,

ఆ తల్లి ముద్దు బిడ్డ లై ,

కీర్తి శిఖరాలను అథిరోహించి,

నలుదిశలా కీర్తి బావుటాలను ఎగరేసి,

ఆ చంద్ర తారార్కం అఖండ తేజస్సు తో ప్రకాశిద్దాము.

తెలుగు తల్లి కి పట్టుబట్ట కట్టి ,

అచ్చ తెలుగు నుడి కారంతో నుదుట కుంకుమ దిద్ది,

ఘన కీర్తి ని పూలమాల గా వేసి,

మృతమవుతున్న మన మాతృభాషను అమృతమయం చేద్దాం.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

 
 
 
bottom of page