100% మంచి ఆరోగ్యం ఊరు
Updated: Jul 25, 2025
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ManchiArogyamVuru
#మంచిఆరోగ్యంఊరు, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

100% Manchi Arogyam Vuru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 24/07/2025
100% మంచి ఆరోగ్యం ఊరు - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
I)
ఆ ఊరు పేరు (వంద శాతం) "100% మంచి ఆరోగ్యం ఊరు".
దాని పాత పేరు ఎవరికి తెలియదు. ఆ ఊరిలో అందరూ "100% మంచి ఆరోగ్యంతో" ఉంటారు.
ఈ విషయం ఆ నోట - ఈ నోట తెలిసిన కొందరు మీడియా వారు ఆ ఊరిని సందర్శించారు.
ఆ ఊరి వారిని ఓ చెట్టు కింద సమావేశ పరిచి, "మీ ఊరు 100% (వంద శాతం) ఆరోగ్యం ఊరు ఎలా అయింది? వివరించండి" అంటూ ప్రశ్నించారు (మీడియా వారు).
ఓ పెద్దాయన (రామయ్య) ఇలా చెప్పటం ప్రారంభించాడు,
"కొన్ని సంవత్సరాల క్రితం - ముందు.. "
-------------------------------------
II)
--------- గతం - flashback ------
ఓ పెద్దాయన (రామయ్య) ఇలా చెప్పటం ప్రారంభించాడు,
"కొన్ని సంవత్సరాల క్రితం (-ముందు).. సామాజిక - కళాశాల విద్యార్థిని 'శ్రీలేఖ - బృందం' (విద్యార్థుల బృందం).. మా ఊరికి 'సామాజిక అభ్యుదయం - బాగు: ప్రాజెక్ట్' చేయడానికి వచ్చారు".
"వారు మాకు 11 ఆరోగ్య సూత్రాలు వల్ల వేసారు - వెల్లడించారు..
ప్రతి మనిషి -;ప్రతి రోజు క్రమం తప్పకుండా పాటించాలి అని చెప్పారు.
..
ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి అని హితబోధ చేసారు"
---------------------------
III)
----------- 11 ఆరోగ్య సూత్రాలు --------------
(ప్రతి మనిషి -;ప్రతి రోజు పాటించాలి)
[
ముఖ్య గమనిక: ఒక టీ స్పూన్ (1 చమ్చా) పరిమాణం
= 5 గ్రాములు
]
-------------------------------
తక్కువగా తినాలి???:
1) రోజు ఉప్పు లవణం తినడం (వినియోగం) 5 గ్రాములు మించొద్దు
2) రోజు నూనె తినడం (వినియోగం) 10 గ్రాములు మించొద్దు
3) రోజు కారం (ఎర్ర లేక పచ్చిమిరపకాయలు లేక మిరప పొడి) మరియు మసాలా తినడం (వినియోగం) 5 గ్రాములు మించొద్దు
4) రోజు చక్కెర తినడం (వినియోగం) 25 గ్రాములు మించొద్దు
5) *వేపుడు తిండి తినడం తగ్గించాలి.
*ఎక్కువ సార్లు భోజనం చేయండి కానీ తక్కువ పరిమాణంలో తినండి.
[ముఖ్య గమనిక: ఒక టీ స్పూన్ (1 చమ్చా) పరిమాణం
= 5 గ్రాములు]
-----------------------------------------------------------------------
ఎక్కువగా తినాలి???:
6) రోజు కూరగాయలు ఎక్కువగా వండుకు తినాలి.
7) రోజుకు 'ఒక్కసారి' పండ్లు తినాలి. అది శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు
యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. భోజనానికి ముందు లేదా అల్పాహారంగా తినడం ఉత్తమం. ఇది మీ శరీరానికి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.
పండ్ల రసం తాగకుంటే మంచిది.
కూరగాయలు - పండ్లు..
*రోగనిరోధక శక్తిని పెంచుతుంది
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
* పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
*కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి మరియు వయస్సు-సంబంధిత దృష్టి లోపం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
* పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
8) రోజు తృణధాన్యాలు - పూర్తి గింజలు వండుకు తినాలి.
-------------------------------
9) రోజు వ్యాయామం చేయాలి.. కనీసం 30 నిమిషాలు ఉదయం మరియు చల్లటి సాయంత్రం వేళ.. కనీసం నడక చేయాలి
10) ధూమపానం (పొగాకు) మరియు మద్యపానం అస్సలు చేయరాదు. మీ వూర్లో వాటి విక్రయం వ్యాపారం నిషేదించండి.
-------------------------------
11)
*కొట్లాటలకు - వాదనలకు దూరంగా ఉండాలి
*ఇష్టం లేని వ్యక్తులతో - పనులతో - సంస్థలతో - స్థలాలతో దూరంగా ఉండాలి
*100% మంచి మాటలు చేతలు ఆచరణ - సంతోష పూరిత నిర్వహణ - ఆనంద దాయక పరిష్కారాలు తీరు తో జీవించాలి
*మంచి పుస్తకాలు నీతి కథలు చదవాలి
*చెడు దూరంగా ఉండాలి. మౌనం మేలు. మంచి చేయకున్నా పర్వాలేదు కానీ ఎవరికి రవ్వంత కీడు చేయరాదు.
* దళారీ -హాని -భూత సర్ప పైశాచిక తత్వం - డాలర్ మోజు - డబ్బు దురాశ- అసహజ అసంతుష్టి నిర్వహణ - ఉత్తుత్తి పోసులు- జోక్యం, బలిపశువు చేయడం.. కు దూరంగా ఉండాలి.
.. అప్పుడు మనసు - హృదయం ప్రశాంతంగా ఉంటుంది.
--------------------------
IV)
ఆ పెద్దాయన (రామయ్య) ఇలా ముగించాడు
..
"ఆ 11 ఆరోగ్య సూత్రాలు తూచ తప్పకుండా పాటించడం జరిగింది మేమెందరము.. మా ఊళ్లో.
అందుకే మా ఊరు యెప్పుడో ఆరోగ్య కరమైన ఊరు అయిపోయింది.. అందుకే అదే పేరు పెట్టుకున్నాము ఈ ఊరికి.. స్పూర్తిగా ఉంటుంది ప్రతి దేశానికి ఊరికి.. సర్వ ప్రపంచానికి".
---- గతం - ఫ్లాష్ బ్యాక్ సమాప్తం.. END of flashback ----
V) ------- వర్తమానం - present ---------
మీడియా వారు ఈ విషయం అన్ని దిన - వార పత్రికల్లో ప్రచురించారు.. రేడియోల్లో వినిపించారు.. టీవీలో ఇంటర్నెట్లో చూపించారు.
అన్నీ ఊర్ల వారు అదే 11 మంచి ఆరోగ్య చిట్కాలు పాటించారు. త్వరలో నిజంగా ఆ దేశం 100% ఆరోగ్యం దేశం గా మారి పోయింది. ప్రపంచానికే ఆరోగ్య స్ఫూర్తిగా మారి పోయింది.
క్రమంగా ప్రపంచం కూడా ఆ 11 సూత్రాలు పాటించి ఆరోగ్య ప్రపంచం గా మారి పోయింది.
శుభం.
----------------------------------------------------------------
నీతి;
11 ఆరోగ్య సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తే 100% మంచి ఆరోగ్యం తేలికగా వస్తుంది.. ప్రతి మనిషికి
--------- చిన్న కథ - నీతి - సమాప్తం ----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.

Comments