top of page

అగ్ని దేవుడు

Updated: Dec 5, 2023


'Agni Devudu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 15/11/2023

'అగ్ని దేవుడు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


అగ్ని దేవునికి ఆకలధికము

అజ్యముంటెను భోజ్య మధికము

నిప్పు రవ్వ తోడనె నింగి నిండును

కమల జన్ముని సృష్టి యంతయు

కాల్చి తినుటకు కాకువు జాపును

బడబాగ్ని రూపు తోడను పాథోధి నిండి యుండును

కార్చిచ్చు రూపు దాలిచి కాననాన్నే మింగ జూచును

ఎన్ని పూజలు ఎన్ని వ్రతములు

అగ్ని తోడనె ఆరంభించినా

ఇంగలానికి ఇంగితమేదీ

అష్ట దిక్పాలకులలో

ఆగ్నేయమున కధిపతియై

దాశరథులు నల్వురు మరియు హనుమయు

జన్మకిచ్చెను పాయసంబు

ఆహవనీయము దక్షిణాగ్ని గార్హపత్యము

త్రేతాగ్నుల పేర తేజస్సుగ నిల్చెను

ముక్కంటి మూడవ కంట

ప్రజ్వలించుచు ప్రకాశించును

పేరుకేమొ నీటి బిడ్డడు

విశ్వమంతా వ్యాప్తి జెంది

పర్పరీకము ప్రాకుచుండును

నిండు ప్రాణముల హరించ నుండును

ఎవరితోనూ పరిహాస మనిన

అంగారమున కందకుండుము.


-సుదర్శన రావు పోచంపల్లి


1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 02, 2023

చాలా బావుంది.

Like
bottom of page