అనుగ్రహం
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #అనుగ్రహం, #Anugraham, #TeluguStories, #తెలుగుకథలు

Anugraham - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 03/11/2025
అనుగ్రహం - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
ఆరోజు ఆదివారం. శరభయ్య శాస్త్రి గుడిలో ప్రత్యేక పూజలున్నాయని, త్వరగానే ఇంటి లో పూజ ముగించుకుని, వీధి లోకి అడుగు పెట్టాడు.
వెంటనే అతని ముక్కు పుటాలకు ఘాటైన చేపల వాసన తగిలింది. ఎదురుగా ముప్పయి ఏళ్ళ యువతి, నిర్మల, తట్టలో చేపలు పెట్టుకుని అమ్ముకుంటోంది.
"ఓసి నీ అఘాయిత్యం కూల. ఏకం గా బ్రాహ్మణులుండే వీధిలోనే పెట్టావు నీ దుకాణం. పో పో. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఏడు. " అని కోపంగా మాట్లాడి, ఆ చేపలమ్మే ఆవిడ వెళ్ళేదాక
ఊరుకోలేదు.
ఆ యువతి తట్ట ఎత్తుకుని బస్ స్టాండ్ వైపు వెళ్ళి పోయింది. శరభయ్య శాస్త్రి పొద్దున్నే చేపలకంపు అని తిట్టుకున్నాడు.
*******'*
మరుసటి ఆదివారం. శరభయ్య శాస్త్రి ఆటో దిగి కెపిహెచ్ బి మెయిన్ రోడ్ క్రాస్ చేస్తుండగా, కారు అతను గుద్దేసి వెళ్ళి పోయాడు. శరభయ్య శాస్త్రి రోడ్ పక్కన పడిపోయాడు. ఎవరూ పట్టించుకోలేదు. అతని తల నుండి నెత్తురు కారుతుంది.
అక్కడికి ఉత్సాహవంతుడైన "S" TV రిపోర్టర్ వచ్చాడు.
"చూసారా. ఒక పెద్దాయన రోడ్ మీద పడిపోతే పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. కనీసం ఏం జరిగిందని కనుక్కోవడం లేదు. అంబులెన్స్ కి కబురు పెట్టలేదు. " ఉత్సాహంగా వీడియో చిత్రీకరిస్తున్నాడు.
సరిగ్గా అదే సమయం లో నిర్మల శరభయ్య శాస్త్రి ని చూసింది.
"ఇప్పుడు చెయ్యాలసింది వీడియోలు తియ్యడం కాదు" అని రిపోర్టర్ ని కసిరి, వెంటనే ఆటోని పిలిచి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది.
**********
శరభయ్య శాస్త్రి మోబైల్ చూసి ఆయన భార్య కి కబురు పెట్టింది. శరభయ్య కి రక్తం చాలా పోయింది. డాక్టర్ రక్తం ఎక్కించాలన్నాడు.
"నా గ్రూపు ప్రయత్నించండి" అంది శరభయ్య భార్య పద్మావతి.
రక్త పరీక్ష చేశాక పద్మావతి గ్రూపు సరిపోదని తెలిసింది. సమయానికి హాస్పిటల్ లో శరభయ్య గ్రూపు రక్తం లేదు. శరభయ్య స్నేహితులు మా రక్తం తీసుకోండి అని ముందుకు వచ్చారు.
వాళ్ళ రక్తం కూడా సరిపో లేదు. చివరికి నిర్మల రక్తాన్ని పరీక్షీంచాడు డాక్టర్.
నిర్మల రక్తం గ్రూపు "ఓ పాజిటివ్" అని తేలింది. అంటే యూనివర్సల్ డోనార్. డాక్టర్ నిర్మల రక్తం సరిపోయిందని, అనుమతి స్తే తీసుకుంటాను అని అన్నాడు. నిర్మల సంతోషంగా తన రక్తాన్ని ఇచ్చింది.
*******'
రెండు రోజుల తర్వాత శరభయ్య శాస్త్రి హాస్పిటల్ లో, స్పృహ లోకి వచ్చాడు.
ఎదురు గా భార్య పద్మావతి.
"ఏం జరిగింది?"
"మీకు రోడ్ మీద యాక్సిడెంటయితే, హాస్పిటల్ కి తీసుకు వచ్చింది, నిర్మల!"
అటు చూసాడు. ఆ చేపలమ్మే నిర్మల!
"అంతే కాదు, తన రక్తం ఇచ్చి మిమ్మల్ని రక్షించుకుంది"
ఒక్క సారిగా శరభయ్య కంట్లో నీళ్ళు తిరిగాయి. కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మల కి నమస్కరించాడు.
"రోజూ కామాక్షి కి, మీనాక్షి కి పూజలు చేస్తాను. ఆ అమ్మ, నీ రూపం లో వచ్చి కాపాడుతుందని గ్రహించలేక పోయాను. కామాక్షి.. ఇలా కరుణించావా? " అని భావోద్వేగానికి లోనయ్యాడు శరభయ్య శాస్త్రి.
"నాదేముంది. సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి ఏదో తోచింది చేసాను" అంది నిర్మల.
"లేదు నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన బ్రతికారు" అన్నాడు డాక్టర్.
"పద్మా, ఇంటికి వెళ్ళాక నిర్మల కి పట్టుచీర, గాజులు పువ్వులు ఇచ్చి సత్కరించాలి. మర్చిపోకు. " అన్నాడు శరభయ్య శాస్త్రి!
"అలాగే చేద్దాం, విశ్రాంతి తీసుకోండి"
"కనబడే ఈ కామాక్షిని సత్కరించక బోతే, ఆ కనబడని కామాక్షి అనుగ్రహిస్తుందా? "
పద్మావతి కళ్ళ ల్లో ఆనంద భాష్పాలు!
అక్కడి దృశ్యం మానవత్వానికి పట్టాభిషేకమై నిలిచింది!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.

Comments