top of page

బామ్మ గారి మాటలు

Nov 8, 2024
1 min read

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BammaGariMatalu, #బామ్మగారిమాటలు


Bamma Gari Matalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 08/11/2024

బామ్మ గారి మాటలు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కన్నవారి కళ్ళల్లో

ఆనందం నింపాలి

వారి గొప్ప మనసుల్లో

ఆశలు నెరవేర్చాలి


తల్లిదండ్రుల పలుకుల్లో

ప్రేమను రుచి చూడాలి

వారు పడే తపనలో

బాధ్యత గుర్తించాలి


అమ్మానాన్నల మదిలో

కాస్త చోటు పొందాలి

సువిశాల ప్రపంచంలో

ఒదిగి ఎదిగి పోవాలి


జన్మ దాతల కలలను

సాకారం చేయాలి

సున్నితమైన మనసులను

అర్థం చేసుకోవాలి


-గద్వాల సోమన్న




Comments


bottom of page