top of page

చివరి కోరిక - పార్ట్ 1

Updated: Nov 12, 2025

#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries


Chivari Korika - Part 1 - New Telugu Story Written By Madduri Bindumadhavi 

Published In manatelugukathalu.com On 10/11/2025

చివరి కోరిక - పార్ట్ 1 - తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

ఆ రోజు 'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం. ఆ వేడుకకి సుందరిని ముఖ్య వక్తగా ఆహ్వానించారు. 

 

65 సం. ల సుందరి.. నుదుటిన మెరుస్తున్న కుంకుమ, ముదురు ఆకుపచ్చ పట్టు చీర, కొంగు భుజాల నిండుగా కప్పుకుని, రజని సాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వేదికనెక్కింది. 


“అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రసంగించగల అర్హత నాకు ఉందో లేదో తెలియదు. కానీ ఈ రోజు నేను ఇలా వేదికనెక్కి నలుగురిలోనూ ప్రసంగించగలుగుతున్నానంటే ఆ గొప్పతనం అంతా నాకు బిడ్డల్లాంటి నా మరిది విశ్వం, తోటికోడలు రజనీలదే. వారి వయసు చిన్నదే కానీ, మనసు చాలా పెద్దది. చిన్నవారు కాబట్టి వారికి నమస్కరించలేను. అందుకే వారికి సభాముఖంగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ” 


“నాలాగా చిన్నతనంలో భర్తని పోగొట్టుకుని, ఆ విషాదాన్ని మరవలేక ఇంటి నాలుగు గోడలకి పరిమితమై తల్లడిల్లుతున్న అనేక మంది సోదరీమణులకి నా జీవితం ఒక స్ఫూర్తి కావాలి. అందం అనేది భగవంతుడిచ్చేది. ఆ అందాన్ని ఆడదానికి ఒక బూచిగా చూపించి, సభ్యతగా బతకనివ్వని తోడేళ్ల గుంపు లాంటి సమాజంలో సహృదయంతో కుటుంబ సభ్యుల అండదండలు ఉంటే ఫరవాలేదు. లేనప్పుడు వారి జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. ” 

 

“అందరి జీవితాల్లోనూ చిన్నవో, పెద్దవో సంఘటనలు తప్పక జరుగుతూనే ఉంటాయి. అవి విషాదాన్ని కలిగించినప్పుడు కొంతకాలం బాధపడటం సహజం. కానీ ఇంటి నాలుగు గోడలకి పరిమితమై అక్కడే ఆగిపోకుండా మన జీవన ప్రయాణం కొనసాగించే ప్రయత్నం మనమే చేయాలి. అప్పుడే ఇంట్లో వాళ్లు, సమాజం తన వంతు సహకారం అందిస్తారు. ఈ సేవా సమాజం లాంటి సంస్థల ఆదరణ ఉంటే ఒక స్త్రీ తనని తాను కాపాడుకుంటూ, తాను అనుకున్నది సాధించగలదు. ” 


“నాకు సంబంధించినంతవరకు, మా మరిది విశ్వం, తోటికోడలు రజని నన్ను తమ గుండెల్లో పెట్టుకుని అభిమానించటమే కాక, నాకు ధైర్యం చెబుతూ, మధ్యలో ఆపేసిన నా చదువు పూర్తి చేసేటందుకు ఎంతో కృషి చేశారు. నేను ఈ సంస్థలో చేరి, ఈ తరం పిల్లలతో పాటు అనేక కంప్యూటర్ కోర్సులు చేశానంటే వారితో పాటు మీ అందరి ప్రోత్సాహమే కారణం. ” 

 

“ఒక స్త్రీ తనకి 'చీమ తలకాయ' అంత ఆసరా ఇస్తే, 'ఏనుగు తలకాయ' అంత ఫలితాలు సాధించి చూపించగలదు అని చెప్పటానికి నా జీవితమే ఒక ఉదాహరణ. ” 


 “నా జీవిత గమనం గురించి చెప్పాలంటే..” 

 

========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================


మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








Comments


bottom of page