top of page

దివ్య దీప్తుల దీపావళి

  • Oct 30, 2024
  • 1 min read

Updated: Nov 10, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #దివ్యదీప్తులదీపావళి, #DivyaDipthulaDeepavali


'Divya dipthula Deepavali - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 30/10/2024

'దివ్య దీప్తుల దీపావళితెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


భారతీయ సంస్కృతికి

ప్రతిబింబం దీపావళి

సమైక్యంగా అందరూ 

జరుపుకునే దీపావళి


జాతిని జాగృతం చేయు

దివ్య దీప్తుల దీపావళి

దీప మాలికల శోభతో

వెలుగులీను దీపావళి


విజయానికి ప్రతీకగా

జరుపుకునే దీపావళి

చైతన్య కాంతుల మిళిత

 ఆనంద శోభావళి


కొత్త బట్టల రెపరెపలు

పిండి వంటల ఘుమ ఘుమలు

బాణసంచా సవ్వడులు

వెరసి ఘన దీపావళి


గుండెల్లో నెలకొన్న

అజ్ఞానపు చీకట్లు

బ్రతుకుల్లో దాగున్న

భీకరమైన ఇక్కట్లు


విజ్ఞాన దివ్వెలతో

మదిని సుఖశాంతులతో

తరమాలనే దీపావళి

ఇష్టమైన దీపావళి


-గద్వాల సోమన్న




Comments


bottom of page