top of page

ఎందుకు ఇలా? ఏమిటి ఇలా?

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #EndukuIlaEmitiIla, #ఎందుకుఇలాఏమిటిఇలా


Enduku Ila Emiti Ila - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 09/07/2025

ఎందుకు ఇలా? ఏమిటి ఇలా? - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


ఎందుకు ఇలా? ఏమిటి ఇలా?

ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు ఈ బాధలు?


ఇంతేనా జీవితం - ఇదియే జీవనపోరాటం. 


కష్టాల సుడిగుండంలో చిక్కుకుని కనుచూపు మేర కానరాని దరి కొసం ఎండమావు ఆశల ఎదురుచూపులు. 

నిరాశ, నిస్పృహ, నిర్లిపతలతో కూడిన మానసిక వేదన - జీవన సంఘర్షణ. 


అంతులేని మనోవ్యథ - అంతం లేని ఆవేదన. 

కోటికోరికలను హృదిలో అమ్ములపొదిలా పొదుపుకుని వైవాహిక జీవితంలో అడుగిడితిని. 


పూలదారి అన్న భ్రమలో ముళ్ల దారిన పయనించాను. ఆ ముళ్లను తీసి నడుద్దామని ప్రయత్నించి విఫలమైతిని. 

వ్యక్తిత్వం, ఆత్మాభిమానం చంపుకుని బానిసలా అత్తింట ఊడిగం చేసితిని. 

అత్తింట అంతా నా వాళ్ళే అని భ్రమచి విర్రవీగితిని. 

ఇన్ని సం... జీవనపయనంలో వాళ్లు నా వాళ్ళు కాదు, కాలకూట విషసర్పాలని తెలిసి వగచితిని. 

కట్టుకున్న మొగుడే కాలయముడై కాల్చుతుంటే, 

నాది అనుకున్న ఇల్లే యమపురిలా మారితే, 

అగ్నిలో పడిన మిడతలా దహించుకుపోతున్నాను. 


మెడలోని ఉరితాడును ఉంచుకోనూలేను- తెంచుకోనూలేను. 

ఇది జీవిత కాలపు ఆవేదన. అంతేలేని మనోవేదన. 

గుండె లోతుల్లోంచి పొంగుతున్న జలధార - అభాగ్యురాలి కన్నీటి అశ్రుధార. 


ఇది చెప్పేదీకాదు - చెపితే తీరేదీ కాదు. 

ఇదియే జీవితం - ఇంతే ఈ జీవితం. 

కట్టెకాలేదాకా కడదాకా ఇంతే. 

వాయువై పంచభూతాలలో లీనమైతేనే నా బాధలు పోయేది- నాకు సంతోషం మిగిలేది. 




-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page