గందరగోళం
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Gandara Golam, #గందరగోళం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Gandara Golam - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 30/08/2025
గందరగోళం - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
నాకు మంచి ఉద్యోగం రాకుండానే ఇంట్లో పెళ్ళి చేసేసారు. మా బామ్మ తన ఆఖరి కోరిక కోసం, నా మరదలిని ఇచ్చి పెళ్ళి చేసేసారు. చేసేది ఒక చిన్న ఉద్యోగం.. నాలుగు రాళ్ళు వస్తాయి, కానీ ఈ రోజుల్లో బతకడానికి పదికి పైనే రాళ్ళు కావాలి.. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కదా మరి.
ఇక లాభం లేదని, సుందరం ఒకటి డిసైడ్ చేసుకున్నాడు. ఆ సుందరం నేనే.. ఎలాగైనా పెద్ద ఉద్యోగం సంపాదించాలని. దానికోసం కష్టపడి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో హైదరాబాద్ లో ఇచ్చారు. మాదా ఒక చిన్న ఊరు. బ్యాగ్ సర్దుకుని బయల్దేరాను. వెళ్తున్నప్పుడు మా ఆవిడ ఎదురొచ్చి..
"బావా.. ! నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా!"
"నేను వెళ్ళేది ఎగ్జామ్ కోసం, హనీమూన్ కోసం కాదు. నువ్వు నా పక్కన ఉంటె, ఇక ఎగ్జామ్ మీద దృష్టి ఎక్కడుంటుంది చెప్పు సుందరీ.. ! నీ అందం అటువంటిది.."
భార్య చిన్నగా నవ్వి, మురిసిపోయింది.
“అదీ.. నువ్వు అలాగే నవ్వుతూ ఉండు.. నేను ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను"
"బావా.. ! నేను నిన్ను వదిలి అసలే ఉండలేను. నువ్వు తొందరగా రాకపోతే, నేనే వచ్చేస్తాను.. హైదరాబాద్ నాకు బాగా తెలుసు.."
"హైదరాబాద్ నీకు బాగా తెలుసా..? నాకు చెప్పనే లేదే"
"అదే బావా.. ప్రతి సినిమాలో హైటెక్ సిటీనీ చూపిస్తారు కదా, చార్మినార్, ఒక కేబుల్ బ్రిడ్జి.. అన్నీ నాకు తెలుసు"
"ఇవన్నీ సినిమా తెలివితేటలా..? సంతోషం.."
సుందరం స్టేషన్ కు బయల్దేరాడు. ట్రైన్ ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాడు. చల్లగాలికి వెంటనే నిద్ర పట్టేసింది. 'చాయి చాయి' అని ఎవరో చెవి దగ్గర అరిచినట్టుగా ఉంటె, తెలివి వచ్చేసింది..
"ఒక చాయి ఇవ్వు.."
"అవును.. నా బ్యాగ్ ఏది..? అయ్యో! ఎవడో కొట్టేసాడే. చుట్టూ అందరినీ అడిగాడు. అంతా మాకు తెలియదు అన్నారు.
ఆ బ్యాగ్ లోనే అన్నీ ఉన్నాయే.. పర్సు తో సహా. ఇప్పుడు ఏం చెయ్యడం..? అంటూ దిగులతో లేనిపోని ఆలోచనలు మనసుని ఆవహించాయి. బాధతో ట్రైన్ తలుపు చివరి మెట్టు దగ్గర నిల్చొని.. చీకటిలోకి చూసాడు సుందరం.
*******
"హలో.. !"
"హలో బావా.. ! నేనే ఇంకా ఫోన్ చేద్దాం అనుకుంటున్నా.. ఎక్కడవరకు వెళ్ళావ్..?"
"హలో.. నేను రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ దొరికిన పర్సు, అడ్రస్ ని బట్టి సుందరం ఫోన్ నుంచి కాల్ చేస్తున్న.. సుందరం అంటే ఎవరు?"
"మా ఆయన.. ఆయనకు ఏమైంది..?"
"సారీ మేడం.. మీ ఆయన ట్రైన్ గుద్దడంతో చనిపోయారు.. బాడీ నుజ్జు నుజ్జై పోయింది. దొరికిన ఆధారాలతో మీకు ఫోన్ చేస్తున్నాను. ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత.. బాడీని అంబులన్స్ లో పంపిస్తాము.."
సుందరికి ఏడుపు ఆగలేదు.. కొత్తగా పెళ్ళైన తనకి ఎంత కష్టం వచ్చింది. "నేనూ ఆయనతో వెళ్ళి ఉంటె బాగుండేది" అనుకుని బాధపడింది.
"వాడు పెళ్ళి ఇప్పుడే వద్దు.. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటానని అడిగినా వినకుండా చేసాను.. నాదే తప్పు" అని సుందరం తండ్రి విలపించాడు.
"ఊరుకోండి.. ! ఏడిస్తే పోయిన మనిషి తిరిగి వస్తాడా? జరగాల్సింది చూడాలిగా" అని అందరూ ఓదార్చారు.
"ఇక నాకు మంచి చీరలు కట్టుకునే యోగం లేదా.. ? నగలు పెట్టుకునే భాగ్యం లేదా..? పెళ్ళికి చాలా పట్టుచీరలు కొనుక్కున్నానే?" అని ఏడవడం మొదలుపెట్టింది సుందరి.
"ఊరుకో తల్లీ.. ఏం చేస్తాం?" అని సుందరి తల్లి ఓదార్చింది.
దహన కార్యక్రమాలు ముగిసాయి. అందరూ కూర్చొని మిగిలిన ఏడుపు ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నారు. ఈలోపు 'సుందరి' అని ఎవరో పిలుపు.
"ఎప్పుడూ ఆయన పిలుస్తున్నట్టే ఉంటుంది.. ఇదంతా నా భ్రమ.. " అనుకుంది సుందరి.
"నేను నీ బావను.. ఇదంతా ఏంటి?"
"అప్పుడే దెయ్యం అయిపోయావా బావా? తెల్లబట్టల్లోకి షిఫ్ట్ కూడా అయ్యావా?"
"నీ మొహం.. ! నేనే నీ బావని. అయినా ఏంటి ఈ అవతారం?"
"మీరు పోయారు కదా.. ! అందుకే పట్టుచీర తీసేసి, వైట్ డ్రెస్ వేసుకోమని ఇచ్చారు.. "
"ఏడ్చినట్టే ఉంది.. ఎదురుగా మనిషి ఉంటేనూ.. నా దహనం కూడా చేసేసారా? గ్రేట్!"
"మీరు దెయ్యం కాదా..? అయితే రోజంతా నేను ఏడ్చింది వేస్ట్ కదా.."
"నిన్ను తిట్టాలో, ఏమనాలో తెలియట్లేదు సుందరి. మీ నాన్న నిన్ను అమాయకురాలు అన్నారు గాని.. మరీనా?"
"నాన్నా.. ! మీరేనా నన్ను గుర్తుపట్టారా..?" అడిగాడు సుందరం.
"ఒరేయ్ సుందరం.. ! నువ్వు చనిపోయావని అన్నీ చేసేసామురా..? ఎలా వచ్చావు? యమగోల సినిమాలో లాగ, పైన ఎంట్రీ లేదా?”
"అదేమీ లేదు.. ట్రైన్ లో నా బ్యాగ్ ఎవడో కొట్టేసాడు. ట్రైన్ తలుపు దగ్గర నిల్చుంటే, కాలు జారి పడ్డాను అంతే.. చిన్న దెబ్బ. నేను బాగానే ఉన్నాను"
"మరి పోలీసులు అలా ఎందుకు చెప్పారు? ఏమిటి ఈ గందరగోళం?"
"మీరు చెప్పిన దానిబట్టి చూస్తే, నా పర్సు, ఫోన్ కొట్టేసిన మనిషికి యాక్సిడెంట్ అయివుంటుంది. దొరికిన ఆధారాలను బట్టి చనిపోయింది నేనే అనుకుని మీకు అతని శవం నాదని అప్పగించారు.. "
"మా అబ్బాయి వచ్చేసాడు. ఆ చావుమేళం ఇక ఆపండి.. డీజే మ్యూజిక్ అదరగొట్టండి.. " అంటూ సుందరం తండ్రి ఆనందంగా అన్నాడు.
"హమ్మయ్యా.. ! ఈ తెల్ల చిర మార్చేసి.. పట్టుచీర కడతాను. ఏడ్చి ఏడ్చి మేకప్ అంతా పోయింది.. మళ్ళీ వేసుకోవాలి.." అంటూ ఇంటి లోపలికి వెళ్ళింది సుందరి.
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ

Comments