top of page

హృదయ మందిరం లో..

#HrudayaMandiramlo, #హృదయమందిరంలో, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Hrudaya Mandiramlo - New Telugu Poem Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 25/07/2025

హృదయ మందిరం లోతెలుగు కవిత

రచన: గొర్రెపాటి శ్రీను


ఆశయాన్ని అందుకోవాలని అభిలషిస్తూ కదులుతుంటాను!

రేపన్నది ఓ ప్రశ్నలా మారి

నన్ను నేను అర్థం చేసుకునేలోగా

మరో సంఘటన ఏదో ఎదురవుతుంటుంది!?


తెలిసీ తెలియక అడుగులేస్తుంటే

అక్కడక్కడా అగాధాల వంటి అడ్డంకులు..

నన్ను నేను విశ్లేషించుకునే సమయం కాస్త తక్కువగా ఉన్నట్లున్నా..

అదరను బెదరను..


గుండెలనిండా నిండిన ఆత్మవిశ్వాసం సాక్షిగా..

ధీమాగా ముందుకు సాగుతుంటాను !

నా అచంచలమైన నా నమ్మకమే నన్ను గెలిపిస్తుందనుకుంటూ..

ఓటమి ఓ పాఠం అనుకుంటూ..

జయతీరాలు చేరే వరకు అవిశ్రాంతంగా జీవన పోరాటం చేస్తుంటాను! 


పడడం సహజం..పడినప్పుడు అంతకంటే బలంగా లేవడం ఘనం!

అదే జీవన విజయ సూత్రం!

హృదయ మందిరం లో..

చెదరని స్వప్నంలా ఆశయం అనురాగబంధమై

నిలుస్తున్నవేళ 

లక్ష్యమే నేస్తం కాగా.. గమనమే విజయ మార్గం! 


***


గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments


bottom of page