top of page

ఇలలో కైలాసం.. శ్రీశైలం

#IlaloKailasamSrisailam, #ఇలలోకైలాసంశ్రీశైలం, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #TeluguPoems


Ilalo Kailasam Srisailam - New Telugu Poem Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 19/08/2025

ఇలలో కైలాసం..శ్రీశైలంతెలుగు కవిత

రచన: గొర్రెపాటి శ్రీను


"హర హర మహాదేవ శంభో శంకర"

అంటూ నినదిస్తూ 

మల్లికార్జునుడి దర్శనానికై

అశేష భక్త జనవాహిని నల్లమల కొండల్ని దాటుకుని

చేరుకునే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన క్షేత్రం శ్రీశైలం!

పార్వతీదేవి భ్రమరాంభికా దేవి గా 

కీర్తించబడుతూ

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా వెలసిన

అష్టాదశ పీఠాలలో ఒకటైన క్షేత్రం శ్రీశైలం! 

శైవ కవి పాల్కురి సోమనాధుడు 

పండితారాద్యచరితం లో..

'కరమొప్ప దక్షిణ కైలాసం'

అంటూ మెచ్చి ప్రణమిల్లి శివయ్య ఆరాధన లో 

తరించిన మహిమాన్విత ప్రదేశం శ్రీశైలం!

గలగల పారేటి గంగమ్మ ఈ క్షేత్ర సమీపాన కృష్ణమ్మ గా 

జలసిరుల అందెల రవళులతో పల్లవించేను! 

కృష్ణమ్మ కొండకోనల్లో సెలయేళ్ళ నెన్నో కలుపుకుంటూ

వడివడిగా పరుగెడుతూ

జంగమయ్య పాదాల చెంతన నాట్య విన్యాసాలతో అలరించేను!

సాక్షి గణపతి శ్రీశైలం వచ్చే భక్తులను అనుగ్రహించేను! 

అగస్త్య మహర్షి,ఆదిశంకరాచార్యులు, 

శాతవాహనులు,శివాజీమహారాజ్,రెడ్డిరాజులు

ఎందరో ఈ క్షేత్రానికి విచ్చేసి 

మల్లికార్జున స్వామిని దర్శించుకుని

ముక్తిని,మోక్షాన్ని పొందిన సుక్షేత్రం శ్రీశైలం!

సిరిగిరి,శ్రీగిరి,

శ్రీమల్లికార్జనుడు బ్రమరాంభికాదేవి సమేతుడై 

కొలువుదీరిన పుణ్యభూమి 

నాటి శ్రీ కైలాసమే..నేటి శ్రీశైలం!

***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments


bottom of page