top of page

జీవిత సత్యం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #JeevithaSathyam, #జీవితసత్యం


Jeevitha Sathyam - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 28/04/2025

జీవిత సత్యం - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


ఓ మనిషీ! ఇకనైనా  గ్రహించు. 

‘నానాటి బ్రతుకు నాటకము’  అన్నది వాస్తవం.

భర్త,బిడ్డలు అంతా నాకు అండగా ఉన్నారని  భ్రమించి మిడిసిపడకు.

బంధువులు, తోబుట్టువులు ఎవరూ నీవారు  కారని  గ్రహించి  మసలుకో.

అందరూ  మరమనిషిలా  నిన్ను  వాడుకుని  వదిలేస్తారని  గ్రహించు. 

ఒంటరిగా  భువిపైకి  వచ్చావు.

అనాధవని అవగతం చేసుకుని బ్రతుకు గడుపు.

ధైర్యాన్ని వీడక  వాస్తవజగతిని  అర్థం  చేసుకో.

నీకు నీవే అండ‌, నీవే ధైర్యం, నీవే శక్తి.

అనుక్షణం  నిన్ను  నడిపించేది  నీవు నమ్మే దైవమని  గ్రహించు.

భగవన్నామస్మరణ  మరువద్దు.

అనుక్షణం  నిన్ను కాపాడేది  అదే.

నీకర్మ ఫలం  నీవు అనుభవించక తప్పదు.

నీకూడా  వచ్చేది  నీవు  సంపాదించిన ధన, సువర్ణ, ఆస్తి,అంతస్తులు కాదు.

వాటికోసం జీవితమంతా పాకులాడే నీబ్రతుకు  ఎంత నీచమో గ్రహించు.

నీకూడా వచ్చేది  నీకీర్తిప్రతిష్టలు పాపపుణ్యాలు.

నీవు వస్తూ  ఏం తెచ్చావు?

పోతూ ఏం  కట్టుకుపోతున్నావు?

అపురూపంగా చూసుకున్న  నీ దేహంకూడా   కడకు  కట్టెలో  కాలిపోతుంది.

ఏకాకిగా  వాయువులో  లీనమవుతావు.

ఇదే జీవితం - ఇంతే జీవితం - ఇదే జీవిత సత్యం.



-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page