top of page

జ్ఞానోదయం

Updated: Jan 21, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Jnanodayam, #జ్ఞానోదయం


Jnanodayam - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 04/01/2025

జ్ఞానోదయం - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


గుండెను గుడిగా చేశాను

మమతల మంచం వేశాను

తల్లిదండ్రులకు ప్రేమగా

స్వాగత గీతిక వ్రాశాను


వారి త్యాగమే చూశాను

సేవల పల్లకీనెక్కాను

కనిపించే ఇలవేల్పులని

గట్టిగా మదిని నమ్మాను


జోలపాటనే విన్నాను

ఒడి ఉయ్యాలో ఊగాను

నాన్న భుజాలపై స్వారీ

చేసి సంతసం పొందాను


ఇల్లే కోవెలని ఎరిగాను

కన్న ప్రేమ గుర్తించాను

అమ్మానాన్నల మాటలే

ప్రగతి బాటలని తలచాను


తల్లిదండ్రుల గద్దింపులు

ఉజ్వల భవితకవి త్రోవలు

అర్థం గనుక చేసుకుంటే

తెలియును కన్నోళ్ల విలువలు


-గద్వాల సోమన్న



Comments


bottom of page