top of page

కలసి నడవాలి

#కలసినడవాలి, #KalasiNadavali, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #TeluguArticleOnUnity

Kalasi Nadavali - New Telugu Article Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 17/05/2025

కలసి నడవాలి - తెలుగు వ్యాసం

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శరదృతువులో బాతులు దక్షిణ దిశగా ఎగురుతున్నప్పుడు "V" ఆకారంలో కనిపిస్తాయి. ఈ ప్రకృతి చర్యకు ఒక పరమార్థం ఉంది. ఆర్నిథాలజీ పరిశోధకులు బైటపెట్టిన ఆ విశేషాలు, ఒక సమూహంగా కదలాల్సిన పరిస్థితుల్లో మనిషి పాటించవలసిన నియమ నిబంధనలను పాఠాలుగా నేర్పిస్తాయి. 


ప్రతి పక్షి పైకి ఎగిరే క్రమంలో తనను వెనక నుంచి అనుసరించే పక్షి కూడా అదే ఎత్తులో అంతే వేగంగా ఎగిరేందుకు కావాల్సిన 'వాలు' ను ప్రదర్శిస్తూ రెక్కలు ఆడిస్తుంది. గుంపులోని ప్రతి పక్షి నిక్కచ్చిగా ఈ నియమం పాటిస్తుంది. పర్యవసానంగా పైకెగిరే బాతుల వరుస దూరం నుంచి V అక్షరాన్ని తలపిస్తుంది. ఇట్లా ఒక సమూహంగా ఎగరటం వల్ల ప్రతి పక్షికి విడిగా ఎగిరే దూరంలో 71 % కలిసొస్తుంది. 

మనుషులు కూడా ఒకటే లక్ష్యంగా సమాజ భావనతో కలసి ప్రయాణిస్తే, ఒకరి మద్దతు మరొకరికి ఉపయోగిస్తుంది. ప్రయాణం సులభతరం చేస్తుంది. 


ఒక బాతు గుంపు నుండి వెనకపడితే, ఒంటరిగా ప్రయాణించడం కష్టమవుతుంది. అప్పుడు అది తిరిగి వరుసలో చేరుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. తన ముందు ఎగురుతున్న బాతు ఇచ్చే ప్రోత్సాహం పొందడానికి ఈ ప్రయత్నం ఉపయోగిస్తుంది. మనిషి కూడా బాతుల స్పృహ కలిగి ఉంటే, తోటి వారితో కలసి ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోవచ్చు. 


ఇంకో విశేషం ఏమిటంటే, గుంపుకు ముందుండి నాయకత్వం వహించే పక్షి గాని అలసిపోతే, చల్లగా వెనక వరసలోకి జారుకుంటుది. మరో బాతు ముందు కొచ్చి దాని బాధ్యత అందుకుంటుంది. ఒకరి బాధ్యత మరొకరు అందుకుంటూ ముందుకు సాగితే మనుషులూ ఒక సమూహంగా చురుకుగా కదలడానికి వీలుంటుంది. 


గుంపులోని బాతులు ఎగురుతూ కూతలు పెట్టడం గమనించవచ్చు. సగం దారిలో జావ కారిపోకుండా ముందు ఎగిరే పక్షికి అవి ఉపునిస్తాయి. వెనక ఉండే తోటి మనిషి ప్రోత్సహిస్తుంటే ముందుండి పని చేసే వాడిలో కూడా నిరాశ తొంగిచూడదు. హుషారుగా కదలడానికి వీలవుతుంది. 


అన్నిటికన్నా విశిష్టమైనది బాతుల్లోని సహానుభూతి తత్వం. ఒక బాతు అనారోగ్యంతోనో, గాయపడో వరుస నుండి పడిపోతే, మరో రెండు బాతులు దానితో పాటు కిందికి దిగి వచ్చేస్తాయి. గాయపడిన సహచర పక్షికి రక్షణగా నిలుస్తాయి. కోలుకొనే దాకా సపర్యలు అందిస్తాయి. పూర్తి స్వస్థత చేకూరటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాయి. దురదృష్టవశాత్తూ అన్ని ప్రయత్నాలు విఫలమయితే మరణించే వరకు సాటి జీవికి వదిలిపెట్టి పోవు. 


మనిషి బాతుల వంటి జీవులను చూసి ఇలాంటి చాలా జీవన సూత్రాలే ఆదర్శంగా తీసుకోవాలి. జాతులు, కులాలు, మతాలు పేరుతో విద్వేషాలకు లోనయి ఎవరికి వారుగా విడిపోవడం ప్రమాదకర మని గ్రహించాలి. ఏ విభేదాలకు తావీయకుండా కలసికట్టుగా సాగినప్పుడే తనతో పాటు జట్టు.. జట్టుతో పాటు తనూ సవ్యంగా ఎదిగేది. 


***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


1 Comment


professorcsgk
May 17, 2025

మంచి సందేశం వున్న వ్యాసం. ప్రకృతి ఐకమత్యం కలిగి ఉండమనే చెబుతోంది. మనమే...

Like
bottom of page