top of page

మహా ఘనులు

Dec 19, 2024
1 min read

Updated: Jan 14, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MahaGhanulu, #మహాఘనులు


Maha Ghanulu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 19/12/2024

మహా ఘనులు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


వేసుకున్న వలువలు

కాళ్లకున్న చెప్పులు

చేసిన వారు  ఘనులు


అందమైన కుండలు

చిన్ని చిన్ని మొక్కలు

పెద్ద పెద్ద తరువులు

పెంచిన వారు ఘనులు


పెంపుడు జంతువులు

గదిలోని కుర్చీలు

మెడలోని హారాలు

రూపకర్తలు ఘనులు


వ్రాసుకునే కలములు

చేతికున్న గాజులు

ముక్కుపై అద్దాలు

చేసిన వారు ఘనులు


చెవులకున్న రింగులు

అందాల భవనాలు

గొప్ప జలాశయాలు

కట్టిన వారు ఘనులు


అతిపెద్ద వంతెనలు

పనికొచ్చే బుట్టలు

పండుకునే చాపలు

అల్లిన వారు ఘనులు


పూవులతో మాలలు

పొలంలోన పంటలు

కడుపుకింత మెతుకులు

పెట్టేవారు ఘనులు


ఇంటిలోన తల్లులు

అశుభ్రమైన దుస్తులు

కప్పుకునే దుప్పట్లు

ఉతికిన వారు ఘనులు


అతి తెల్లగ బట్టలు

తలలోని వెంట్రుకలు

మూతిపై మీసాలు

కత్తిరించిన ఘనులు


గౌరవింతురు జనులు

నడిపే వాహనాలు

మాట్లాడే సెల్లులు

కనిపెట్టిన ఘనులు


-గద్వాల సోమన్న



Comments


bottom of page