top of page

మాస్టారు మేటి మాటలు

Dec 27, 2024
1 min read

Updated: Jan 1, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మాస్టారుమేటిమాటలు, #MashtaruMetiMatalu


Mashtaru Meti Matalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 27/12/2024

మాస్టారు మేటి మాటలు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


జీవితాన ఏమాత్రము

లేకుంటే సర్దుబాటు

ఏదో ఒక రోజున ఇక

తప్పదోయి క్రుంగుబాటు


మనలను నమ్మిన వారిని

పొడవరాదు వెన్నుపోటు

గొప్పోలు చూపు దారిని

వైదొలగిన సిగ్గుచేటు


వదిలిపెడితే క్షేమము

హానికరము మిడిసిపాటు

మితిమీరిన  అలవాట్లు

తెచ్చిపెట్టు గుండెపోటు


మహనీయుల లక్షణము

దిద్దుకుంటే పొరపాటు

పెద్దలను ధిక్కరిస్తే

జీవితంలో నగుబాటు


-గద్వాల సోమన్న



Comments


bottom of page