top of page

నేటి మహిళ

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #నేటిమహిళ, #బాటసారి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Neti Mahila - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 18/07/2025 

నేటి మహిళ - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


చాందస భావాల ఒరవడిలో కొట్టుకుపోకుండా 

నేను నా వ్యక్తిత్వము అనే దిశలో నడుస్తూ పురోగమించాలి.. విలువలను గౌరవిస్తూ వివిధ రంగాలలో ప్రవేశించి ప్రావీణ్యతను పొందుతూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలి. 


ఆత్మహత్యలూ ఆక్రందనలూ, ఆవేదనలు 

వార్తలలో వనితల దుస్థితి ప్రతిఫలిస్తూనే ఉంది.

 ధైర్యము తోడుగా స్వయం రక్షణా శక్తిని పెంపొందించుకుని అబలను కాదు సబలనని నిరూపించుకోవాలి. 


ఆనాడే అతివలకు అగ్రస్థానము సమాజములో లభిస్తుంది. అరాచకాలకు అంతము చూడవచ్చు. 

ఆనాడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం లభించినట్లు. 















బాటసారి

------------------

ప్రకాశించేసూర్యుడు జ్ఞాన జ్యోతి వెలిగిస్తే 

నిశీధిలో చంద్రకాంతి దారి చూపిస్తూ ఉంటే

సత్యాన్వేషణ కై అవిశ్రాంతంగా 

పయనము చేసేను బాటసారి. 


దుర్గంధము నుండీ సుగంధము 

కల్మషములో దాగిన స్వఛ్చతను 

క్రోధం వెనక ఉన్న ఆప్యాయతను 

నిట్టూర్పులలో దాగి ఉన్న వ్యధను 

మథించి శోధించి శాంతికై పరుగులు దీసేను బాటసారి. 


గమ్యం సుగమం అయ్యేదాకా 

సంకల్పం సిద్ధించేదాకా 

స్థిత ప్రజ్ఞుడిగా ధీరచిత్తముతో 

పయనించే బాటసారి 

విశ్వశ్రేయస్సుకై తపించే శ్రామికా 

జగత్తుకు నీవు మార్గదర్సివై శోభిల్లాలి. 


***

నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

Comments


bottom of page