top of page

పేనుకు పెత్తనమిస్తే

#PenukuPethanamisthe, #పేనుకుపెత్తనమిస్తే, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Penuku Pethanamisthe - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 15/06/2025

పేనుకు పెత్తనమిస్తే - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


ఆశ్రమంలో నిత్యం యోగాలో ఉండే ముకుందస్వామి ఇహం మరిచి అహంలో ఉంటున్నారు. తల, మొహం మీద కేశాలు దట్టంగా పెరిగాయి.


ఆయన శిరస్సు మీద దట్టంగా పెరిగిన జుత్తులో మద్యలో తెల్లని వెంట్రుకలు పక్కలంట నల్లని వెంట్రుకలు ఉన్నాయి. మీసాలు, గెడ్డాలు కూడా నలుపు తెలుపు వెంట్రుకలతో ఏపుగా కనబడుతున్నాయి.


స్వామి నెత్తి మీద దట్టంగా పెరిగిన నలుపు తెలుపు కేశ సంపదలో సఖ్యతగా గంభీర, స్వాంతన, కురచ జాతుల పేలు తండాలుగా గెడ్డాలు గుబురు మీసాలలో నివాసం చేసుకుని జీవిస్తు వాటి శరీర పెరుగుదలతో, చిన్నగాను పెద్దగాను నలుపు తెలుపు, ఊదా రంగులతో స్వేచ్ఛగా మనుగడ సాగిస్తున్నాయి.


ఎలా వచ్చాడో తెలియదు కాని ‘అమెగా’ దీవి నుంచి డ్రంబు అనే తెల్లగా బొద్దుగా బానపొట్టతో ఉన్న ఒక దుడ్డు పేను స్వామి స్వేత కేశ మైదానంలో ప్రవేశించి కొన్ని పేలను పటాలంగా చేసి తన ఆధిపత్య బావుటా ఎగరవేసాడు.


"ఇటుపైన యోగా స్వామి కేశ సంపదకు నేను అధిపతిని. మీరందరు నా మాట ప్రకారం నడుచుకోవాలంటు మీసాలు, గెడ్డాలలో ఉన్న చిన్న పెద్ద అన్ని జాతుల పేలు నాముందు హాజరుకావాలి" అని ఆర్డర్ వేసాడు.


తెల్లటి వెండి జుత్తుతో బానపొట్ట డ్రంబు మాటకు తిరుగులేకపోయింది. గెడ్డాలు మీసాలలో ఉన్న చిన్న పెద్ద పేలు నడి నెత్తి మీద తెల్లటి మైదానంలో ఒకవైపు నల్లరంగు మరోవైపు ఊదారంగు పేలు ఒదిగి ఒదిగి నిలబడ్డాయి.


అమెగా డ్రంబు పేను మద్యలో ఠీవిగా నిలబడి తన దర్పం కనబరుస్తున్నాడు. రెండు వైపుల ఆయుధాలతో అంగరక్షకులు నిలబడి ఉన్నారు.

 

ఇటుపైన తన అనుమతి లేకుండా ఉన్న అక్రమ వలసదారుల్ని వెంటనే వారి స్వస్థలాలకు తిరిగి పోవాలని ఆదేసించాడు.


‘అమెగా డ్రంబు’ నిబంధనలు పెట్టినప్పటి నుంచి అన్ని ప్రాంతాల పేలకు కష్టాలు మొదలయాయి. ఇప్పటి వరకు మీసాలు గెడ్డాలలో నివాసముండే అన్ని జాతుల పేలు తల మీద ఉండే పేలతో సామరస్యంగా సంబంధ బాంధవ్యాలతో ఇతర ప్రదేశాలకు వస్తు పోతుండేవి.


అమెగా స్వేత డ్రంబు పేను వచ్చినప్పటి నుంచి వాటికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. తన అనుమతి లేనిదే ఏ పనీ చేయకూడదని నిబందనలు పెట్టేడు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక చోటికి వలస వెళ్లాలంటె డ్రంబు అనుమతి కావాలి. ఆడ పేలు పెట్టిన గుడ్లకు ప్రసవ

పన్నులు కట్టాలట. పరిమితికి మించి గడ్లను పొదిగితే అధిక పన్నులు చెల్లించాల్సి వుంటుంది.

 

శ్వేత దీవి నుంచి డ్రంబు రాక ముందు స్వామి కేశ సంపదలో

ఆధిత్య పోరు సాగుతుండేది. అంతర్యుద్ధాలు, సరిహద్దులలో

ఒకరి కొకరితో కోట్లాటలు జరుగుతుండేవి. ఇదే అదునుగా వారి

మద్య రాజీ కుదిర్చే పనిగా తన స్వప్రయోజనాలపై దృష్టి పెట్టాడు డ్రంబు. ప్రత్యర్ధుల నుంచి తన శ్వేత మైదానికి రక్షణగా గోల్డెన్ వైడ్ నెట్ తయారీకి పథకాలు ఆలోచిస్తున్నాడు.


యోగి ముకుందస్వామికి రోజూ భంగు, గాంజా హుక్కా పీల్చే అలవాటుంది. ఆ నిషాలో ఆయన తన శిరస్సు మీద జరిగే సంఘర్షణలు గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు.


రాను రాను ముకుందస్వామి తల మీద కేశాలలో, మీసాలలో, గెడ్డంలో ఉండే వివిధ జాతుల పేల పోరాటాలు, డ్రంబు ఆధిపత్యంతో మరింత రెచ్చిపోయి స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.


చివరకు విసిగిపోయిన స్వామి ఒకరోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రానికి పోయి తల నీలాలు, గెడ్డం, మీసాలు దేవునికి అర్పించి శిరోముండనం చేయించుకున్నాడు. తల భారం తగ్గి హాయి అనిపించింది.


ఈ డ్రమ్ములాంటి డ్రంబుకి పెత్తనమిస్తే సుఖంగా బతుకుతున్న మనల్ని ఇలా పుణ్యక్షేత్ర కేశగుట్టలో పడవేయించాడని వాపోయాయి తలలోని పేలు.


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page