పొంగింది పూరీ
- Mohana Krishna Tata

- Aug 3, 2025
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #PongindiPuri, #పొంగిందిపూరీ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Pongindi Puri - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 03/08/2025
పొంగింది పూరీ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"వదినగారు.. ! వదినగారు.. !" అంటూ పక్కింటి పంకజం ఇంట్లోకి వచ్చింది.
"చెప్పండి వదినా.. ఏదైనా పనా?" అడిగింది పావని.
"పనుంటేనే రావాలా ఏమిటి.. ? ఏదో కొత్త గరిట కొన్నావంటగా.. చెప్పనేలేదు"
"ఏదో చిన్న గరిట.. ఇంకా నీకు కాల్ చేద్దాం అనుకున్నా.. నువ్వే వచ్చావు. బాగుంది కదూ?" అంటూ గొప్పగా చూపించింది పావని.
"ఎంత బుజ్జిగా ఉందో.. ఎంతైనా నీ సెలక్షన్ సూపర్.. గరిట చూడు ఎలా మెరిసిపోతోందో.. స్టీల్ గరిట ఎంత తెల్లగా ఉందో"
"ఏం వదినా.. కాఫీ తాగుతావా?" అంటూ మురిసిపోతూ అడిగింది పావని.
"నీ చేత్తో ఇస్తే, అమృతమే అనుకో.. " కాఫీ తాగుతూ అంది పంకజం.
"కాఫీతోపాటు వేడిగా రెండు దోశలు కూడా తిని వెళ్ళు వదినా"
(హమ్మయ్యా.. ! పొంగింది పూరీ.. అందుకేగా బ్రష్ చేసుకుని డైరెక్ట్ గా వచ్చింది - పంకజం మైండ్ వాయిస్)
"ఇంతకీ ఈ గరిట ఎక్కడ కొన్నావో?" అడిగింది పంకజం.
"మన ఊరి చివర సంతలో కొన్నాను.."
"నువ్వు కాబట్టి డబ్బులు ఖర్చుపెట్టి, అంత దూరం వెళ్లి, ఈ చిన్న స్టీల్ గరిట కొన్నావు.. మేము కొనగలమా?"
"మరీ అంత పొగడకు వదినా.. కాఫీ, టిఫిన్ తో పాటు, భోజనం కూడా చేసి వెళ్ళు వదినా.. నీలాగ మాట్లాడేవారంటే నాకు తెగ ఇష్టం"
(పూరీ ఇంకా బాగా పొంగిందే.. తెలుసు తెలుసు అందుకే, ఈ రోజు వంట చెయ్యకూడదని డిసైడ్ అయ్యే వచ్చాను - పంకజం మైండ్ వాయిస్)
"ఏదో అన్నావా.. ?"
"అదే.. అదే.. నీ వంట తినడానికి ఎవరైనా పెట్టిపుట్టాలి - అదే అన్నాను"
"ఇదిగో వదినా.. ఇంకో దోశ వేసుకో.. ఇంతకీ దోశ ఎలా ఉందో చెప్పనేలేదు"
"నువ్వు ఎంత మంచిదానవే వదినా.. దోశ కేమి సూపర్ గా ఉంది.. " అంది పంకజం.
(నాకు టిఫిన్ ఖర్చు తగ్గింది- పంకజం మైండ్ వాయిస్)
"అన్నయ్యగారికి బాక్స్ లో పెట్టి ఇవ్వనా.. రుచి చూస్తారు.. రాత్రికి కూడా పార్సెల్ పంపిస్తాలే"
(అందుకే కదా.. ఈ ప్లాన్ అంతా - పంకజం మైండ్ వాయిస్)
సాయంత్రం పావని భర్త ఇంటికి వచ్చిన తర్వాత..
"పావని! ఈ రోజు ఏంటో స్పెషల్.. చాలా ఆకలి వేస్తోంది"
"మీకు జస్ట్ చారు, ఆవకాయ అన్నం అంతే.. "
"అదేంటి.. కిచెన్ లోనుంచి ఘుమ ఘుమలు వస్తుంటే.. "
"అది.. అది.. "
"ఎవరైనా పొంగిస్తే చాలు.. పూరీ లాగ పొంగిపోతావు.. ఈ రోజు పొంగిందా పూరీ?"
"అదేనండి.. పక్కింటావిడ నేను కొన్న గరిట చాలా బాగుంది అంది.. "
"అంటే మాత్రం.. కాఫీ, టిఫిన్, భోజనం విత్ ఫ్యామిలీ పార్సెల్ ఇచ్చేస్తావా?"
"ఏం చెయ్యమంటారు.. ఎప్పుడైనా మీరు నన్ను అలా మెచ్చుకున్నారా చెప్పండి?"
"నేను ఎలా పొగడగలను చెప్పు.. ముందు వంట బాగా నేర్చుకో.. అప్పుడు చూద్దాం"
(మీరు అలా ఉంటే, నేను ఇలానే ఉంటాను - పావని మైండ్ వాయిస్)
మరోపక్క పంకజం భర్త..
"పంకజం.. ! ఈ పార్సెల్ ఎక్కడిది?"
"అదా.. పక్కింటావిడ పావని ఉందిగా.. పొగిడితే పొంగింది పూరీ లాగ.. అంతే పార్సెల్ ఇచ్చేసింది.. తినండి ఫ్రీ"
"తప్పు కదే.."
"ఏమిటి తప్పు.. కొన్నది ఒక చిన్న గరిట.. దానికి పెద్ద గొప్ప ఏమిటో.."
"పాపం కదే.. వాళ్ళాయన కష్టపడి సరుకులు తెస్తుంటే, నువ్వేంటి ఇలా.."
"మొన్న ఆవిడ ఏం చేసింది మీకు తెలుసా.. ?"
"చెప్పు.. వింటాను"
******
"అమ్మా.. ! ఆకలేస్తుంది కొంచం అన్నం ఉంటే పెట్టండి" అంటూ ముష్టివాడి అరుపులు పావని ఇంటిముందర.
"నా వంట ఎప్పుడూ మా ఆయన మెచ్చుకోరు.. ఈ ముష్టివాడికి పెట్టి చూస్తాను.. "
"ఇదిగో బాబు.. ఈ కూర అన్నం తీసుకో.. తిని ఎలా ఉందో చెప్పాలి"
ఆకలితో వెంటనే తినేసాడు ముష్టివాడు..
"బాగుందా?" ఆత్రంగా అడిగింది పావని.
(అమ్మగారిని పూరీ లాగ పొంగిస్తే, ఏదైనా ఇచ్చేస్తుందని, కాలనీ అంతా టాక్.. కూర సుమారుగా ఉంది - ముష్టివాడి మైండ్ వాయిస్)
"ఆహా.. ! సూపర్ అమ్మా.. ! ఇన్ని ఇళ్ళల్లో అడుక్కుంటానుగానీ ఎప్పుడూ ఇంత రుచిగా తినలేదు.. "
"మా ఆయనా ఉన్నాడు.. ఎప్పుడూ నా వంట మెచ్చుకోడు.. " అనుకుంది పావని.
(నేను ఒక్కసారికే ఇలా ఉంటే, రోజూ ఆయన ఎలా తింటాడో పాపం.. అయినా నాకెందుకు.. నాకు ఫ్రీ భోజనం కావాలి అంతే! - ముష్టివాడి మైండ్ వాయిస్)
"మీ ఆయనగారు ఆఫీస్ లో క్యాంటీన్ ఉందా అమ్మా.. ?"
"ఉంది.. అయినా ఆయన నా వంటే తింటారు తెలుసా?"
(మీ ఇంటాయన ఎందుకు అంత సన్నగా ఉంటాడో ఇప్పుడు తెలిసింది నాకు - ముష్టివాడి మైండ్ వాయిస్)
"రేపటినుంచి నీకు మా ఇంట్లోనే భోజనం.. నా కొత్త వంటలు రుచి చూసి నువ్వే చెప్పాలి.. "
(హమ్మయ్యా.. ! పొంగింది పూరీ.. ఇక రోజూ ఫ్రీ భోజనం - ముష్టివాడి మైండ్ వాయిస్)
"ఈ కాలనీలో అందరి వంటలు నీకు తెలుసుగా.. అందరి వంటలకన్నా నావే గొప్పగా ఉంటాయని నేను ప్రూవ్ చేస్తాను.. " అంది పావని.
"ఒక్క రోజుతో కాదమ్మా.. కొన్ని రోజులు మీ వంట తిని, అప్పుడు చెబుతాము.. "
"నీ ఇష్టం.. నీ కోసం రోజూ పన్నెండయ్యే సరికి వంట సిద్దం చేస్తాను.. "
"పార్సెల్ కట్టి ఇచ్చేయండమ్మా.. ఇంట్లో తింటాము. రోజూ ఇక్కడ తింటే బాగోదు.. "
(ఇంటికి తీసుకుని వెళ్లి, కాస్త రిపేర్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది.. )
"అమ్మగారు! ఒక మాట.. ఏమీ అనుకోకూడదు మరి.. "
"నువ్వు ఏది చెప్పినా బాగా చెబుతున్నావు.. చెప్పు"
"మీరు చీరలు బాగా కడతారు.. మీ సెలక్షన్ కూడా సూపర్. రోజూ ఎన్నో ఇళ్ళకి వెళ్తానా, ఎవరికీ చీరల సెలక్షన్ రాదు.. మా ఆవిడ కూడా మీ చీరలంటే భలే మెచ్చుకుంటాది"
"నిజమా.. ! నీ మాటలు వింటుంటే.. , ఎంత ఆనందంగా ఉందో.. ! నా పాత చీరలు కొన్ని ఇస్తాను.. తీసుకెళ్ళు"
(హమ్మయ్యా.. ! పొంగింది పూరీ.. చీరల షాపింగ్ అయిపొయింది)
******
"అలా.. ముష్టివాళ్ళందరికీ రోజూ వండి పెడుతోంది. పొంగిస్తే చాలు, ఏదైనా ఇచ్చేస్తుంది.. తన గొప్పల కోసం. మనకోసం ఆమాత్రం ఇవ్వలేదూ.. " అంది పంకజం.
"నిజమా.. !"
"ఇంకా చెప్పనా.. రాత్రి ఇంటికొచ్చే మొగుడికి మాత్రం.. మిగిలిన పచ్చడి మెతుకులే గతి పాపం.. "
"వాళ్ళాయన ఆమె వంట మెచ్చుకోనంతకాలం అంతే మరి" అన్నాడు పంకజం భర్త
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ



Comments