top of page

ప్రయత్నిద్దాం!!

Dec 16, 2024
1 min read

Updated: Dec 26, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ప్రయత్నిద్దాం, #Prayathniddam



Prayathniddam - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 16/12/2024

ప్రయత్నిద్దాం - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


పెంచుదాం! పెంచుదాం!! 

పుడమిలోన తరువులు

పంచుదాం! పంచుదాం!!

స్వచ్ఛమైన గాలులు


నాటుదాం! నాటుదాం!!

జగమంతా మొక్కలు

చూపుదాం! చూపుదాం!!

పచ్చదనం సొగసులు


తరుముదాం!తరుముదాం!!

కాలుష్యం మహిలో

తలద్దాం! తలద్దాం!!

భగవంతుని మదిలో


చాటుదాం! చాటుదాం!!

మానవత్వం భువిని

కలుపుదాం! కలుపుదాం!!

రెండు మదులు ఘనమని


వాడుదాం! వాడుదాం!!

శుభ్రమైన దుస్తులు

మానుదాం! మానుదాం!!

నీచమైన గుణములు


కోరుదాం! కోరుదాం!!

జనులందరి క్షేమము

పాడుదాం! పాడుదాం!!

దేశభక్తి గీతము


నవ్వుదాం! నవ్వుదాం!!

వెలిగేలా ముఖములు

శ్రమిద్దాం! శ్రమిద్దాం!!

దొరుకు వరకు ఫలితాలు


చేరుదాం! చేరుదాం!!

ఘన విజయ తీరాలు

తెరుద్దాం! తెరుద్దాం!!

మన హృదయ ద్వారాలు


-గద్వాల సోమన్న



Comments


bottom of page