ప్రేమ తీరాలు - పార్ట్ 13
- Lakshmi Sarma B

- Oct 29, 2025
- 7 min read
Updated: Nov 4, 2025
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries
Prema Theeralu - Part 13 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 29/10/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇంజినీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత–కరుణాకర్ మధ్య దూరం వస్తుంది. ఫణి అనారోగ్యానికి గురవుతాడు; బ్రెయిన్ ట్యూమర్‌గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి, ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత. బాబును తీసుకుని లలిత ఇంటినుండి వెళ్ళిపోతుంది. భార్య మాటలు నమ్మినట్లు నటించి, ఫణి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కరుణాకర్.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ప్రేమ తీరాలు పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ప్రేమతీరాలు పార్ట్ 13 చదవండి.
“బాగున్నావమ్మా సరిత… మా రాధ చెప్పడమేగానీ నిన్ను ఎప్పుడు చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫణిని అగాధం కాకుండా కాపాడావు. నీ మేలు జన్మలో మరిచిపోను,” అన్నాడు కాఫీ తీసుకుంటూ. మనసులో మాత్రం నువ్వు చేసిన ఈ పనికి నీకు ఈ జన్మలోనే శిక్షపడేలా చెయ్యకపోతే నేను కరుణాకర్ నే కాదు.
“ఇందులో నేను చేసిందేమిలేదండి. తను నా బావ. కాపాడవలసిన ధర్మం నాకుంది. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది తన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరని. ఎంతసేపు ఆ వెళ్ళిపోయిన లలిత గురించే తప్పా నా గురించి ఆలోచించడు. మీరైనా చెప్పండి,” అంది.
“అందుకేగా వచ్చింది. తనెలాగు వెళ్ళిపోయింది. నీలో నా చెల్లిని చూసుకుని తృప్తిపడతాను, ఫణి… నువ్వు ఎలాగైనా ఈ సరితను పెళ్ళి చేసుకోని సంతోషంగా ఉండు. పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు తన జీవితమని భావిస్తున్న మరదలిని దూరంచేసుకుంటావా చెప్పు,” కన్ను కొట్టి అడిగాడు ఫణి వైపు చూస్తూ.
“అదేంలేదు బావా. నన్ను అంత మోసం చేసిన తనను నేనెప్పుడో మరిచిపోయాను కానీ, సరితకు నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టముంటుందో లేదోనని వెనకడుగు వేస్తున్నాను. సరిత నీకు అభ్యంతరం లేకపోతే నేను సిద్ధమే నిన్ను పెళ్ళిచేసుకోవడానికి. కనీసం ఇప్పుడన్నా నేను చేసిన తప్పును సరిదిద్దుకోని,” సరితను ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు.
సిగ్గుతో తలదించుకుంది సరిత.
“చూసావా ఫణి… మా సరితకు నువ్వంటే ఎంతిష్టమో… ఏమండి తొందరగా ఆ ముహూర్తాలు పెట్టుకుంటే మంచిది,” అంది రాధ. కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుని బయలుదేరారు కరుణాకర్, రాధ.
సరిత ఆనందం చూస్తుంటే పీకపిసికి చంపెయ్యాలన్నంత కోపంతో ఊగిపోతున్నాడు ఫణి. అసలు విషయం తెలుసుకునేవరకు ఓపికపట్టుమన్న కరుణాకర్ మాటకు కట్టుబడి లేని ప్రేమను నటిస్తున్నాడు సరితతో.
రెండునెలలు గడిచిపోవడంతో కిరణ్ బయలుదేరి వచ్చాడు ఇండియాకు. అతని మనసు మనసులో లేదు. లలిత, ఫణి ఎందుకు ఫోన్ తియ్యడంలేదు? ఎన్ని సార్లు చేసాను. ఫణి ఎలా ఉన్నాడు? ఏమైనా ఇబ్బంది ఎదురైందా? తను బాగానే ఉన్నాడు కదా? పరి పరి విధాల ఆలోచనలతో ఆ రాత్రంతా ఇంట్లో గడిపి తెల్లవారుతూనే బయల్దేరాడు లలిత వాళ్ళింటికి.
“బాబు కిరణ్, అప్పుడే లేచి ఎక్కడికి వెళుతున్నావు కాఫీ కూడా తాగకుండా,” కిరణ్ తల్లి జానకి కొడుకు లేవడం చూసి కాఫీ తీసుకుని వచ్చింది. తల్లిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక కాఫీ తాగి.
“లేదమ్మా, నేను అర్జంటుగా ఒకరిని కలవాలి,” తల్లి మనసు బాధపెట్టడం ఇష్టంలేక కాఫీ తీసుకుని తాగి వెళ్లాడు కిరణ్.
“ఏమిటో వీడు ఓ పట్టానా అర్థంకావడంలేదు. ఓ పిల్లను చూసి ముడిపెడితే గానీ కుదురుగా ఉండడు,” కొడుకు వెళ్ళినవైపే చూస్తూ అనుకుంది కిరణ్ తల్లి జానకి.
లలిత వాళ్ళింటికి కప్పంతా తాళం వేలాడుతుండడంతో గుండెలు గెబేల్ మంది కిరణ్ కు. ఒకవేళ ఫణికి ఏదైనా జరగరానిది జరిగిందా? ఫోన్ చేస్తే తీయ్యలేదు. ఇంటికి వస్తే తాళంవేసి ఉంది. మనసు ఆందోళనపడుతుండగా సావిత్రమ్మ ఇంటితలుపు తట్టాడు.
“ఆ ఎవరు నాయన వస్తున్నా,” అంటూ తలుపుతీసి ఎదురుగా నిలుచున్న కిరణ్ ను చూడగానే మండిపడుతూ. “ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు? చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళ సంసారంలో నిప్పులకుంపటి వెలిగించి వాళ్ళిద్దరిని దూరంచేసావు. తృప్తి కాలేదా? నీలాంటి వాడి ముఖం చూడడం కూడా మహాపాపం. వెళ్ళు నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది,” అంది తలుపువెయ్యబోతూ.
“ఆంటీ ఆగండి. మీరంటున్నది నాకు ఒక్కముక్క కూడా అర్థంకాలేదు. నేను వాళ్ళ కాపురంలో నిప్పులు పొయ్యడమేంటి? ఫణికి ఆరోగ్యం బాగానే ఉందా? వాళ్ళింటికి తాళంవేసి ఉంది. ఎక్కడికి వెళ్లారు? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి,” ప్రాధేయపడుతూ అడిగాడు.
“ఆహా ఏమి వినయం! చేసేదంతా చేసి ఏమి ఎరుగనట్టే అడుగుతున్నావు. నీవల్ల కాదు లలిత అప్రతిష్టపాలైంది. సరే నీకంటే పెళ్ళిపెటాకులు లేవు. పెళ్ళిచేసుకుని ఓ బిడ్డకు తల్లిగా ఉండి కూడా నీతో కులకడమేంటో మరీ విడ్డూరంకాకపోతే. ఇంకా తగుదునమ్మా అంటూ వచ్చావా,” అంది కోపంగా చూస్తూ.
“ఆంటీ నేనే తప్పు చెయ్యలేదు. లలిత నాకు తోబుట్టువుతో సమానం. తనను నేను ఆవిధంగా చూసాను. దైవంసాక్షిగా చెబుతున్నాను. చనిపోయినా నాచెల్లి రూపం తనలో చూసుకుంటున్నాను కనుకనే వాళ్ళింటికి రాగలిగాను. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెబుతున్న నిజం. దయచేసి వాళ్ళు ఎటు వెళ్లారో చెప్పండి ఆంటీ,” అడిగాడు బాధగా.
“ఏమో నాయన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడంలేదు. ఆ పిల్లేమో మీరిద్దరు ఉన్న వీడియోలు చూపెట్టింది. నువ్వేమో దైవం సాక్షిగా నాచెల్లి లాంటిదంటున్నావు. మీరు మీరు ఏమన్న చేసుకోండి నాకెందుకు గానీ వాళ్ళిద్దరు విడిపోయారు. లలిత ఎక్కడుందో తెలియదు. ఫణిని వాళ్ళ మరదలట ఆమె తీసుకపోయింది,” కిరణ్ మాటలకు కొంచెం మెత్తబడుతూ చెప్పింది.
“ఓహో ఫణి మరదలు వచ్చిందా? అయితే ఇదంతా ఆ మహాతల్లి ఆడే నాటకమే. ఆ రోజు హాస్పిటల్‌లో కూడా లలితను ఇష్టం వచ్చినట్టు మాటలంది. సరే నేను తెలుసుకుంటాను. మంచితనంతో నన్ను నిరూపించుకుని లలితను, ఫణిని కలిపే బాధ్యత నాది. వస్తాను,” చెబుతూ గిర్రున వెనక్కు తిరిగివెళ్ళిపోయాడు. కిరణ్ వెళ్ళినవైపే చూస్తూ నిలుచుంది సావిత్రమ్మ.
“లలిత… నువ్వు తప్పు చెయ్యనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? నిన్నర్ధం చేసుకోని నీ భర్త కోసం నువ్వెందుకు అనుక్షణం ఆలోచిస్తున్నావు? నిన్ను ఒక్కసారైనా తలుచుకుంటాడా మీ ఆయన? నీకో ఉపాయం చెప్పానా? మీ ఆయన నెంబరు నాకివ్వు. నేను ఆయనతో మాట్లాడుతాను. ఎవరు చూపింది చూసి అదే నిజమని నమ్మితే సరిపోతుందా? అసలునిజం కళ్ళతో చూడకుండానే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమో అడుగుతాను,” అంది రమ.
“రమ… అతని గురించి నీకు తెలియదు. నన్ను, బాబును తలుచుకోని క్షణమంటూ ఉండదు. ఆయనను ఏదో మత్తులో ఉంచి నామీదకు ఉసి గొల్పింది. తరువాత తనేం పొగుట్టుకున్నాడో తెలుస్తుంది. నీకు తెలియదు రమ. నాకోసం ఆయనెంత బాధపడుతున్నాడో నా మనసుకు తెలుసు. మేము మళ్ళీ కలిసే యోగం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,” బాధగా చెప్పింది లలిత.
“మరెందుకు అతన్ని విడిచి వచ్చావు? మెల్లిగా అతనికి నచ్చ చెప్పాలి కానీ ఇలా వదిలేసి వస్తే నీ చేతి దాటిపోడా? అదెవరో నీ మొగుణ్ణి వదిలిపెడుతుందనుకున్నావా? నేను ఒకసారి మాట్లాడి ఆయన మనసేమిటో కనుక్కుంటాను. నువ్వు చెప్పినట్టుగా అతను నీకోసం తపిస్తున్నట్టయితే నీ ప్రేమ గొప్పదని నమ్ముతాను. లేదంటే ఆయనమీద కేసుపెట్టి కోర్టుకు లాగకపోతే నీ స్నేహితురాలినే కాదంటాను,” అంది నవ్వుతూ.
“సరే నీకంతగా నమ్మకంలేకుంటే ఇదిగో ఫోన్ తీసుకుని మాట్లాడు,” ఫణి నెంబరిస్తూ, “నేను అక్కడే ఉండి మార్చటానికి కొంచెం సమయం పడుతుంది. నేను దూరమైతే తప్పా అతను నా గురించి ఆలోచించడు. నన్ను కాదని వేరొకళ్ళను తన జీవితంలోకి రానివ్వడు. నాకా భరోసా ఉంది రమ. మా ఇద్దరి మనసుల్లో ఎటువంటి దాపరికాలుండవు. ఎప్పటికైనా మేము కలుస్తాము,” నమ్మకంగా అంది లలిత.
“మీ ఆయనమీద నీకున్న నమ్మకం వమ్ము కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలిత,” అంది ప్రేమగా లలితను చూస్తూ.
“హలో ఎవరు మాట్లాడుతున్నది,”
“హలో నేను ఫణిని మాట్లాడుతున్నాను… మీరెవరు,” అడిగాడు అవతలివైపు నుండి.
“… నేను ఎవరో మీకు తెలియదు కానీ మీకు మీ ఆవిడకు విడాకులయ్యాయని తెలిసింది. మీరేమనుకోకపోతే మీకు మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే మాట్లాడుదామని ఫోన్ చేసాను,” అంది రమ.
“సారీ అండి… మీరన్నట్టు నేను, నా భార్య విడిపోయామన్నది లోకం దృష్టిలో కానీ, మేమిద్దరం ఎంత దూరంలో ఉన్నా కలిసే ఉన్నాము, ఉంటాము. మా మనసులను ఎవరు విడదీయలేరన్నది నిజం. మీరు మరో సంబంధం చూసుకోవడం ఉత్తమం. ఉంటాను,”
“ఆగండాగండి ఫణిగారు తొందరపడకండి. నేను చెప్పేది వినకుండానే మీరు నిర్ణయం చెప్పేస్తే ఎలాగండి? నా పేరు రమ. నేను లలిత ప్రాణ స్నేహితులం. మీరు చెప్పింది విన్నాక మా లలిత చెప్పింది నిజమేనని తేలిపోయింది. మీతో కొంచెం మాట్లాడాలి. పక్కన ఎవరు లేకుండా చూడండి,” అంది.
లలిత పేరు వినగానే మనసు ఉత్సాహంతో పొంగిపోయింది. “లలిత మీకు తెలుసా? తను తను ఎక్కడుంది? బాబు ఎలా ఉన్నాడు? చెప్పండి. నేను తనను చూడాలి. ఎక్కడికి రమ్మంటారు? తొందరగా చెప్పండి,” ఆత్రుత, ఆరాటంతో అడిగాడు.
“చెబుతానండి. అందుకేగా మీకు ఫోన్ చేసింది. మీరు మీ భార్యను ఎంతగా ప్రేమించారు నాకు తెలుసు కానీ, ఒకరు చేసిన దుర్మార్గానికి మీరిద్దరు విడిపోవడం మీలో ఎక్కడో లలిత మీద ప్రేమ తగ్గిందేమోననిపించింది. ఇప్పుడు మీ మాటలు విన్నాక మిమ్మల్ని కలపాలని అనుకున్నాను. నాకొక మాటిస్తారా మీరు,” అడిగింది.
“చెప్పండి మీరేం చెయ్యమన్నా చేస్తాను. నా లలిత నాకు దగ్గరౌతుందంటే నేనేమైనా చేస్తాను. నా కళ్ళకు ఏవో బైర్లు కమ్మి నా లలితను అనుమానించానే గానీ తన ప్రాణం పోయినా తప్పు చెయ్యదని తెలుసు. చెప్పండి ఏం చెయ్యమంటారు,” అడిగాడు ఉత్సుకతతో.
“అయితే మీరు ముందుగా మీ మరదలు ఉంది కదా. తన ఫోన్ లో ఉన్న వీడియోలు ఎలా తియ్యగలిగావు అనేది కనుక్కోవాలి. తనే తీసిందా? ఇంకా ఎవరైనా తీసారా? లేక అవి గ్రాఫిక్సా? అనేది తెలియాలి. అది తెలిసిందంటే తన ఆట కట్టించొచ్చు. ఏమంటారు,” అడిగింది రమ.
“రమగారు… నాకు అర్ధమైంది. ఇందులో మా మరదలుతోపాటు ఇంకొకరి చెయ్యి ఉందని తెలుసుకున్నాము. అది కూడా ఎవరోకాదు లలిత వాళ్ళ వదిన అనేది వాళ్ళన్నయ్య చెప్పారు. ఇంకా పూర్తిగా తెలియదు. మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. తొందరలో మీకన్నీ విషయాలు చెబుతాను. ఒక్కసారి మా లలితతో మాట్లాడమని చెబుతారా,” వేడికోలుగా అడిగాడు.
“ఇంకేమి తీగ కదిపితే డొంకంతా కదిలినట్టు. మీరందరు ఆదే ప్రయత్నంలో ఉన్నారంటే మన పని తేలికగా అవుతుంది. తొందరలోనే ఆ దొంగలను పట్టుకుని మీ కాపురం చక్కబెట్టుకోవచ్చు. ఫణిగారు మీరు కొంచెం ఓపిక పట్టాలి. లలితతో ఇప్పుడే మాట్లాడడం వద్దు. పొరబాటున మీ మరదలు గమనించిందనుకోండి. తను మరో ఉపాయంతో మీ ముందుంటుంది. మిమ్మల్ని మళ్ళీ మోసం చెయ్యగలదు. జాగ్రత్త సుమా,” అంది నవ్వుతూ.
“ఓకే మరి ఉంటానండి,” ఫోన్ పెట్టేస్తూ చెప్పాడు. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. తన మనసులో అపోహలు తొలిగిపోయాయి. నా లలిత, నా బాబు నాకు దగ్గరకు వచ్చే రోజు త్వరలోనే ఉంది. అనుకుంటూ కరుణాకర్ కు ఫోన్ చేసి చెప్పాడు సంతోషంతో.
కాలింగ్ బెల్ మ్రోగడంతో సరిత వచ్చిందేమోనని వెళ్ళి తలుపుతీసాడు. ఎదురుగా నిలుచున్న కిరణ్ ను చూడగానే ఒక్క క్షణం ముఖం ముడుచుకున్నాడు ఫణి. అంతలోనే తృళ్ళిపడినట్టు నవ్వుతూ. “కిరణ్ నువ్వా? ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి? వస్తున్నట్టు చెప్పలేదేంటి,” అడిగాడు.
“ఫణి… నేనిప్పుడు వచ్చింది నీమీద ప్రేమతో కాదు. లలిత, బాబు ఎక్కడున్నారో చెప్పు? నువ్వు అందరిలానే మగాడిననిపించుకున్నావు. ఏ పాపం తెలియని లలితను నిష్కారణంగా అపనిందలపాలు చేసావు. నీ కళ్ళకు ఏం మైకం కమ్మిందో నాకు తెలియదు. మీ జంటను ఏ శక్తి విడదియ్యలేదని అన్నావే అలాంటిది నువ్వే నీ చేతులారా నీ ప్రాణమైన భార్యను దూరం చేసుకున్నావు. నీతో మాట్లాడాలన్న నాకు మనసు రావడంలేదు కానీ లలిత బాబుతో ఏం కష్టపడుతుందో. ఒక సోదరుడిగా తనకు అండగా నిలబడతాను. ఎక్కడకు వెళ్లిందో చెప్పు,” నిలదీస్తూ అడిగాడు కిరణ్.
“కిరణ్… నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పుచేసానని తెలుసుకున్నాను. ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నా ప్రాణం కాపాడిన నువ్వు మా కాపురం నిలబడడానికి సహకరిస్తే నీమేలు జన్మలో మరిచిపోను,” కిరణ్ చేతులుపట్టుకుని అడిగాడు.
“ఫణి… నువ్వు చెబుతున్నది నిజమా?! నీకు లలిత మీద కోపం లేదా? మరింకెందుకాలస్యం? వెళ్ళి లలిత ఎక్కడుందో తీసుకువద్దాం పద,” అన్నాడు ఆనందంతో.
“కిరణ్ మా మరదలు చేసిన పనికి తనను ఊరికే వదిలితే ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో తెలియదు. ఎలాగైనా తను చేసిన పని బయటపెట్టాలి. తన వేలితో తన కన్ను పొడుచుకునేలా చెయ్యాలి. అందుకే ఆగుతున్నాను. ఆ వీడియోలో ఇంకా ఏమేమి ఉన్నాయో వాటితో ఎన్ని ఘోరాలు చేస్తుందో తనంతట తనే తప్పును ఒప్పుకునేలా చేద్దాం. అంతవరకు ఓపికతో ఉందాం సరేనా,” రమతో మాట్లాడిన మాటలుచెప్పాడు ఫణి.
“ఫణి నువ్వు చెబుతున్నది వింటుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులంటే ఆశ్చర్యంగా ఉంది. పాపం లోకం పోకడ తెలియని లలితకు ఇన్ని కష్టాలా? ఫణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరవాలేదు. నేను చెబుతున్నది నిజం. నాకు ఒక చెల్లెలుండేది. తనకు పదేళ్ళప్పుడు పోలియో వ్యాధి వచ్చి చనిపోయింది. తనంటే నాకెంతిష్టముండేదో మాటల్లో చెప్పలేను. లలితను చూసాకా అచ్చు నా చెల్లి పోలికలతో ఉన్నది. తనలో నా చెల్లిని చూసుకున్నానే కానీ వేరే ఉద్దేశ్యం లేదు. ఇదిగో నా చెల్లి పోటో చూడు నీకే తెలుస్తుంది,” తన పర్సు తీసి అందులోనుండి తన చెల్లి పక్కనే లలిత పోటో చూపాడు. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఫణి.
“చూసావా ఫణి… నేను చెబితే నన్ను పిచ్చివాడిలా చూస్తారేమోనని ఎవరికి చెప్పలేకపోయాను. అదే నేను చేసిన తప్పు. ఆ తప్పే లలిత జీవితానికి మచ్చ తెస్తుందనుకోలేదు. నన్ను క్షమించు ఫణి,” ఫణి చేతులుపట్టుకుని అడిగాడు కిరణ్.
“కిరణ్… నువ్వేతప్పు చెయ్యలేదు. నీలాంటి ఆత్మీయుడిని అర్ధంచేసుకోలేని నేను నిజమైన నేరస్తుడిని. నిజానికి మీరందరు నన్ను క్షమించాలి. తప్పుచేసింది నేను,” కిరణ్ ను ఆత్మీయంగా కౌగిలించుకుంటూ అన్నాడు ఫణి.
“పోనీలే మొత్తానికి మనందరి సమస్య తీరింది. అసలు దోషిని పట్టుకుందాము. సరే నేనువస్తాను,” చెబుతూ వెళ్ళిపోయాడు కిరణ్.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.





Comments