top of page

రంగమ్మత్తా!... డూ యువర్ డ్యూటీ!!

#RangammatthaDoYourDuty, #రంగమ్మత్త, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Rangammattha Do Your Duty - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 28/10/2025

రంగమ్మత్తా!... డూ యువర్ డ్యూటీ - తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


రంగమ్మ మరియు తాయారమ్మ ఇరుగుపొరుగున ఉండే అక్కాచెల్లెళ్ళ వరుసవారు. ఇద్దరికీ ఇతరులను విమర్శించే స్వభావం ఉంది. తాయారమ్మకు పిల్లలు లేరు, కానీ రంగమ్మకు రాముడు మరియు లక్ష్మణుడు అనే ఇద్దరు మగ సంతానం. పెద్ద కోడలు రాజహంస.


ఒక రోజు రాజహంస వాకిలిలో ముగ్గు వేస్తూ ఉండగా, రంగమ్మ డైరెక్షన్ చేస్తూ ఉంది. తాయారమ్మను చూడగానే, రంగమ్మ ఆమెను సమీపించి, కోడళ్ళ పురాణంలో మునిగిపోయారు. పదిహేను నిమిషాలు చర్చించిన తర్వాత, రంగమ్మ ఇంట్లోకి వెళ్ళింది. చర్చలో రెండవ కోడలు స్టోరీ హైలైట్ కాగా, ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు.


రంగమ్మ చిన్న కోడలు, తన అన్న గోవర్ధనం కూతురు. ఆమె పేరు శంకరి. ఆమె మెట్లు దిగి వచ్చి సోఫాలో కూర్చుంది. లోనికి వచ్చిన రంగమ్మను చూసి, "అత్తా!... కాఫీ తీసుకురా!" అంది శంకరి.


శంకరి మాటలకు రంగమ్మ బిత్తరపోయింది, ఆశ్చర్యంతో కదలకుండా నిలబడింది. శంకరి ఆమెను చురచురా చూస్తూ, "ఓ రంగమ్మత్తా!... నాకు బెడ్ కాఫీ తాగే అలవాటు, వెళ్ళి తీసుకురా!" అని చెప్పింది.


అంతలో రాజహంస కాఫీ గ్లాసుతో వచ్చి, చిరునవ్వుతో శంకరికి అందించింది. శంకరి నవ్వుతూ "థాంక్స్ అక్కా!..." చెప్పింది. కోడలు తనను కాఫీ తెమ్మన్నందుకు, తనను లెక్కచేయనందుకు రంగమ్మ మనస్సులో ఆవేదనతో మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది.


శంకరి ఎం.ఎ. చదువుకున్న పిల్ల. తన తల్లి ద్వారా రంగమ్మకు సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకుంది. ఇంట్లోకొచ్చిన నాలుగు రోజుల నుండి రంగమ్మ, మాటలతో రాజహంసను ఏ విధంగా హింసిస్తున్నదో గమనించింది. దీంతో, తోడికోడలు రాజహంస పైన సానుభూతి, అత్త రంగమ్మ పైన అసహ్యం కలిగింది శంకరికి.


అత్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న శంకరి, రంగమ్మ గది ముందు ద్వారం దగ్గర నిలబడింది. "రంగమ్మ అత్తా! వారానికి ఏడు రోజులు కదా! ఇంటి పనులన్నీ నాలుగు రోజులు, రాజహంస అక్క, నేను కలిసి చేశాము... మూడు రోజులు నీ షేర్!?... ఈరోజు గురువారం... గురు, శుక్ర, శని మూడు రోజలు నీ వంతు. "లేచిరా రంగమ్మత్తా!... 'డు యువర్ డ్యూటీ!...' " అని గట్టిగా చెప్పి, ముసిముసి నవ్వులతో వెళ్ళిపోయింది శంకరి.


రంగమ్మ ఉలిక్కిపడి మంచం దిగింది. 'ఈ పిల్ల మహాగడుసుది' అనుకుంటూ వంటగది (రంగం) వైపు బయలుదేరింది.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page