top of page

సుశర్మ కథ

May 23, 2025
2 min read

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDdevotionalStories, #సుశర్మకథ, #SusarmaKatha


Susarma Katha - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 23/05/2025 

సుశర్మ కథ - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


పూర్వం సుశర్మ అనే బ్రాహ్మణుడు వ్యసనాలకు లోనై చేయరాని పాపాలు చేసి, తల్లిదండ్రులను క్షోభ పెట్టి చివరకు మరణించాడు. పాప ఫలితంగా ఒక ఎద్దుగా జన్మించాడు. ఎద్దుగా ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని యజమాని ఎద్దుతో ఎన్నో బరువులు మోయించాడు. బరువులతో కొండల పైకి నడిపించాడు. ఆ ఎద్దు అలాగే చేస్తుండగా పుండు పుట్టింది బరువులు మోయలేకపోయినా, అతనికి అదే జీవనాధారం అవటం వల్ల ఆ యజమాని అలానే బరువులతో కొండల ప్రాంతాల్లో తీసుకెళ్తుండగా, కష్టపడుతూ నడుస్తుండగా కాలు మడతపడి ఆ ఎద్దు కొండ లోయలో పడి మరణిస్తుండగా అక్కడున్న సాధువులు ఎంతో దయ కలిగి వారి పుణ్య ఫలాల్లో కొంతభాగం ఎద్దుకు ధారబోశారు. అలాగే అనుకోకుండా అక్కడున్న ఒక సక్రమమైన జీవనం లేని ఒక స్త్రీ కూడా నాకు తెలిసి ఏ పుణ్యం చేయలేదు ఒకవేళ ఏమైనా చేసి ఉంటే ఆ ఫలం మొత్తం ఎద్దుకు ధారబోసింది అక్కడి సాధువుల సహాయం తో. అటు తర్వాత ఆ ఎద్దు కు మంచి ఉత్తమమైన భాగవతుల కుటుంబంలో బాలుడిగా జన్మ వచ్చింది సాధువులు కంటే ఆ స్త్రీ ధారబోసిన పుణ్య ఫలితంగా.అది విన్న ఎద్దు బ్రాహ్మణ బాలుడిగా జన్మించినా పూర్వ జన్మ జ్ఞానం చేత ఆ స్త్రీ ని కలిసి ధన్యవాదాలు చెప్పుకొని, అసలు ఆమె ధారబోసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలని ఆమెను వెతుకుతూ వెళ్ళాడు.


 ఆమెను కలిసి ధన్యవాదాలు తెలిపి, నీకంత పుణ్యం ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఆవిడ "నాకు తెలిసి నేను చేసిన పుణ్యం ఏమీ లేదు. కానీ నా దగ్గర ఉన్న చిలుక ఏదో చదువుతుంది అది నేనూ విని, దాంతోపాటు చదువుతాను అంతే ' అంది. 


అయితే నన్ను ఆ చిలుక వద్దకు తీసుకెళ్లమని అడుగగా ఆమె తీసుకెళ్లింది. ఇతన్ని చూసిన చిలుక మానవ భాషలో నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే చూస్తున్నాను. నేను పూర్వజన్మ లో ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాను కానీ నీలాగే వ్యసనాలకు గురి అయి జీవితం వ్యర్థం చేసుకున్నాను. ఆ జన్మ నుంచి ఇలా చిలుక జన్మ వచ్చింది. అప్పుడు ఒక ఆశ్రమం లో ఉండేదాన్ని అక్కడ ఉన్న మునులు రోజూ భగవద్గీత పారాయణ చేసేవాళ్ళు అది విని నేనూ చదువుతుండేవాడిని. ఒక అధ్యాయం చదవడం వచ్చింది అంతే. ఒకనాడు ఒక బోయవాడు నన్ను పట్టుకుని తీసుకొచ్చి ఈమెకు అమ్మాడు ఇక్కడ అదే చదువుతుండగా ఈమె కూడా చదివి పుణ్యం పొంది నీకు ధారపోసింది అని చెప్పి వెళ్ళిపోయింది.


సుశర్మ ఈ వృత్తాంతం విని ఒక్క అధ్యాయం చదివి, వింటే నే ఇంత పుణ్యం వస్తే ఇంకా పూర్తిగా చదివి, అర్ధం చేసుకుని నడుచుకుంటే ఇంకెంతో పుణ్యం అని తెలుసుకొని, ఈ జన్మ లో శాస్త్రాధ్యయనం చేసి, భగవద్గీత నిరంతర పారాయణ చేసి, అర్ధం చేసుకుని అలా నడిచి జన్మ అనంతరం పుణ్యలోకాలు పొందాడు.


దీనిని బట్టి తెలిసేదేమంటే మనిషి వ్యసనాలకు దూరంగా ఉండాలి. బ్రతికినన్నాళ్లు సాధ్యమైనంతవరకు మంచి పనులే చేయాలి, ఎవరు చేసేపనులు వారు సక్రమంగా చేయాలి. భగవద్గీత కూడా అదే చెబుతుంది.


శ్రీకృష్ణార్పణమస్తు

����������

సుధావిశ్వం


-సుధావిశ్వం





Comments


bottom of page