top of page

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #TeluguBashaDinotsavaSubhakankshalu, #తెలుగుభాషాదినోత్సవశుభాకాంక్షలు, #గిడుగువెంకటరామమూర్తిజయంతి


గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా


Telugu Basha Dinotsava Subhakankshalu - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 29/08/2025

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


మర్మమెరుగని, మచ్చలేని మన మాతృభాష.

మమతలెరిగిన, మధువులొలికే  మన తెలుగు భాష.


సుగంధ  పూతోటలో  వికసించిన పుష్పమై‌,

మదిలోని  భావాలకు తెలుగు భాషా సౌరభం  రంగరించుదాం.


ప్రేమ సౌభ్రాతృత్వంతో,  దేశ ఔన్నత్యాన్ని పెంచుదాం.

 ప్రేమామృతాన్ని  పంచుతూ,  ఆ మధువు లోని  మాధుర్యాన్ని  గ్రోలుదాం.

కామధేనువు వంటి  తెలుగు తల్లి  క్షీరామృతాన్ని  గోవత్సలై   త్రాగుదాం.


ఆ తల్లి  ముద్దు బిడ్డలై  కీర్తి శిఖరాలను  అధిరోహించి  నలు దిశలా  కీర్తి  బావుటాలను  ఎగురవేద్దాం 

ఆచంద్ర తారార్కం  అఖండ  తేజస్సుతో  ప్రకాశిద్దాం.


తెలుగు తల్లికి  పట్టుబట్ట   కట్టి,  అచ్చ తెలుగు నుడికారంతో  ఆ తల్లి  నుదుటన  కుంకుమ దిద్దుదాం.

ఘనకీర్తిని  పూలమాలగా  వేసి  మృతమవుతున్న  మన  మాతృభాషను  అమృతమయం  చేద్దాం.



-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page