top of page

తెలుగు పదాలు

Dec 28, 2024
1 min read

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TeluguPadalu, #తెలుగుపదాలు


Telugu Padalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 28/12/2024

తెలుగు పదాలు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


తేటతెలుగు పదాలు

మేటి వెలుగు సరాలు

నాటికి నేటికవే

సాటిలేని సుమాలు


పద పదమున సొగసులు

ఎద మీటే రాగాలు

తెలుగు పలుకు అమృతము

వెలుగులీను దీపాలు


సుతిమెత్తని లతికలు

అతిమధుర తేనియలు

తెలుగు పదాలన్నీ

కొలనులోని కలువలు


పెదాలకు బహు ప్రియము

హృదయాలకు మోదము

తేట తెలుగు పదాలు

కోటి  కంటే ఘనము


చల్లని చిరు జల్లులు

తెల్లని మరు మల్లెలు

తెలుగు పద పదనిసలు

సంగీత సరిగమలు


అక్షరాల కలయిక

చేయునవే వేడుక

కాపాడు కోవాలని

అమితమైన కోరిక


అందమైన అమరిక

ముచ్చటైన పొందిక

చూడు తెలుగు పదాలు

స్నేహించు అధరాలు


గువ్వలా ఒదిగి పోయె 

దివ్వెలా వెలిగి పోయె 

ముద్దులొలుకు పదాలు

బుద్ధి నేర్పు పదాలు



-గద్వాల సోమన్న



Comments


bottom of page