top of page

తల్లి మనసు

Dec 30, 2024
1 min read

Updated: Jan 9, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThalliManasu, #తల్లిమనసు


Thalli Manasu- New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 30/12/2024

తల్లి మనసు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


వెన్నెలంత చల్లనిది

వెన్నలాగ  మెత్తనిది

తల్లి మనసు నిజముగా

మల్లె వోలె తెల్లనిది


సహనానికి మారుపేరు

కుటుంబాన తల్లివేరు

అహర్నిశలు పనిచేసే

అమ్మ తీరు సెలయేరు


త్యాగానికి ఆనవాలు

సదనానికి వెలుగుపూలు

తల్లి ఉంటే జీవితాలు

వర్ధిల్లును కుటుంబాలు


అమ్మ లేని చిన్నారులు

తెగిపోయిన పతంగులు

గూడు చెదిరిన గువ్వలు

రాలిపోయిన మువ్వలు


అమ్మ ఉంటే కళకళ

ఆకులున్న తరువుల్లా

లేకపోతే వెలవెల

ప్రాణం కొట్టుకొను విలవిల


వీలైతే గుండెల్లో

అమ్మకు గుడి నిర్మించు!

అప్పుడే జీవితాల్లో

దీవెనలెన్నొ ప్రవహించు!



-గద్వాల సోమన్న



Comments


bottom of page