వీభోవరా - పార్ట్ 19
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Sep 14, 2025
- 5 min read
Updated: Sep 19, 2025
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 19 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/09/2025
వీభోవరా - పార్ట్ 19 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. మురళీ మోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయ్, కాశ్యప్ ల వివాహాలకి ముహుర్తాలు చూస్తారు విజయేంద్రభూపతి తో వివాహం ఇష్టం లేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 19 చదవండి..
రామశర్మ, మాధవీ మాతల ఖర్మకాండలను శాస్త్రయుక్తంగా సత్యనారాయణ శర్మ తన ఇరువురి అల్లుళ్ళతో జరిపించారు.
నారాయణశర్మ హైందవ వైదికి ఖర్మకాండల శాస్త్రాన్ని బాల్యంలోనే తన తండ్రి మహా పండితులు పాండురంగ శర్మ గారి వద్ద అభ్యసించినారు. తన బంధువుల ఇంట జరిగిన వివాహాన్ని దివ్యంగా జరిపించిన సమయంలో రామశర్మ గారు ఒకనాడు.....
"బావమరిదీ సత్యనారాయణా!.... నా ముగ్గురు బిడ్డల వివాహాలను నీవే జరిపించాలి. అదే రీతిగా నా మీ అక్క అంతిమ యాత్రా పర్వాన్ని నీవే జరిపించాలి. ఇది నా కోరిక" అన్నారు.
ఆ బావగారి మాటలను తలచుకొంటూ ఆవేదనతో అక్కాబావల అంతిమయాత్రలను జరిపించాడు సత్యనారాయణ శర్మ. అన్నాతమ్ములు విజయశర్మ, కాశ్యప శర్మలు తమ మాతాపితల ఖర్మకాండలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారు. గోధాన, భూదానం చేశారు. కాశీకి వెళ్ళి తల్లిదండ్రుల అస్థికలను గంగలో కలిపి, జగత్ మాతా పితలను దర్శించి వూరికి తిరిగి వచ్చారు.
ఆ రోజు కాశ్యపశర్మ హైదరాబాదుకు IPS ట్రైనింగ్ పుర్తి చేయ బయలుదేరాడు.
"మామయ్యా!... మీరు ఏనాడో నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం వారి అంతిమ సంస్కార విధులను మాచేత ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. మీకు ధన్యవాదములు" చేతులు జోడించాడు కాశ్యప్.
"అవును మామయ్యా! మీకు నమస్సుమాంజలి" చేతులు కలిపి చెప్పాడు విజయశర్మ.
అందరికీ చెప్పి కాశ్యప్ శర్మ, అన్న విజయ్ శర్మను సమీపించాడు. అతన్ని కౌగలించుకొన్నాడు. కన్నీరు కార్చాడు.
అన్నా! నీవు ఏ విషయానికి భయపడకు, బాధపడకు. నీకు నీ ఈ తమ్ముడు అండగా వున్నాడు. జీవితాంతం వుంటాడు" తమ్ముడు అన్న కన్నీళ్ళను తుడువగా, అన్న తమ్ముని కన్నీటిని తుడిచాడు.
కాశ్యప్, గంగలు కార్లో బయలుదేరి వెళ్ళిపోయారు.
అక్కడ మిగిలివున్నది సత్యనారాయణశర్మ వారి సతీమణి మహాలక్ష్మీ, వారి కూతురు సావిత్రి, కొడుకు విద్యాసాగర్, రుద్రమ, భాస్కర్ శర్మలు.
విజయ్‍శర్మ సత్యనారాయణ శర్మను సమీపించాడు.
"మామయ్యా!.... అమ్మా నాన్నలు లేని ఈ ఇంట్లో నేను వుండలేను. నేను ఆశ్రమ వాసానికి వెళుతున్నాను. భూములను సయ్యద్ మామకు కౌలుకు ఇచ్చాను. దయచేసి మీరు మీతో రుద్రమ, భాస్కర్‍ను తీసుకొని వెళ్ళండి. ఇకపై వారిరువురికీ మీరు అత్తయ్యే తల్లిదండ్రులు. వారిని బాగా చదివించండి. ప్రతి సంవత్సరం సయ్యద్ అంకుల్ మీకు కౌలు సొమ్మును చెల్లిస్తాడు. రుద్రమను, భాస్కర్‍ను జాగ్రత్తగా చూచుకోండి మామయ్యా. వారి భావి జీవితాలను వారు ఆనందపడేలా తీర్చి దిద్దవలసిన బాధ్యత మీదే మామయ్యా!" దీనంగా కన్నీటితో విజయశర్మ సత్యనారాయణ శర్మ చేతులను పట్టుకొన్నాడు.
"విజయ్! నీవెందుకయ్యా ఆశ్రమానికి వెళ్లడం. నీవూ మాతో వుండవచ్చు కదా!...."
"లేదు మామయ్యా. అది కుదరదు. నా మనస్సు ఆశ్రమవాసాన్ని కోరుతూ వుంది. శేష జీవితం ఆ రితిగా సాగిపోవలసిందే. ఈ ఇంటిని పాఠశాలకు ఇవ్వాలనుకొంటున్నాను. మీకు తోచినట్లుగా చేయండి" అనునయంగా చెప్పాడూ విజయశర్మ.
సత్యనారాయణ శర్మ తలాడించాడు.
మహాలక్ష్మి, సావిత్రి సంచులు సర్దుకోసాగారు.
విజయ్ తన గదిలో కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించాడు.
రుద్రమ ఆ గదిలోనికి వచ్చింది.
మనోనేత్రంతో రుద్రమ గదిలోనికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు విజయ్. కళ్ళు తెరిచి రుద్రమ ముఖంలోనికి చూచాడు. రుద్రమ కళ్ళల్లో కన్నీరు.
"రుద్రమా!.... రా!...."
రుద్రమ విజయ్‍ను సమీపించింది. అతని కాళ్ళపై పడి భోరున ఏడుస్తూ....
"అన్నయ్యా!.... నన్ను క్షమించు. మీ విషయంలో నేను తప్పుగా అనేకసార్లు ప్రవర్తించాను. నన్ను మన్నించు అన్నయ్యా!" దీనంగా పలికింది.
విజయ్ రుద్రమ భుజాలను పట్టుకొని లేవనెత్తాడు.
"రుద్రమ!.... తల్లీ!.... వూరుకో నీవు నా పట్ల ఏ తప్పు చేయలేదు. నీపై నాకు కోపం లేదు. కారణం నీవు నా సోదరి కదా అమ్మా! ఏ అన్న అయినా తన సోదరిని ద్వేషిస్తాడా.... కోపగించుకొంటాడా!.... వురుకో... చెల్లీ వూరుకో...!" అనునయంగా వూరడించాడు విజయశర్మ.
"అన్నయ్యా! నేను బాగా చదువుతాను. మీరు సాధించలేని ఆ IPSను నేను సాధిస్తాను. మీరు సదా కోరుకొనే రీతిగా సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని నీతిని నిజాయితీని నేను రక్షించేదానికి నా జీవితాంతం పాటుపడతాను. నా తప్పులను మన్నించు అన్నయ్యా!" దీనంగా కన్నీటితో చేతులు జోడించింది రుద్రమ.
విజయశర్మ తన కుడిచేతిని రుద్రమ తలపై వుంచాడు.
"తల్లీ రుద్రమా! ఆ సర్వేశ్వరులు నీ మనో అభిష్టాన్ని నెరవేర్తురు గాక!" హృదయపూర్వకంగా దీవించాడు.
"అమ్మా!... తమ్ముడు భాస్కర శర్మను జాగ్రత్తగా చూచుకో. అత్తామామల మన్ననలను పొందే రితిగా వారియందున వర్తించు. రుద్రమ రుద్రమే అన్న పేరును సాధించు తల్లీ!..." ప్రీతిగా పలికాడు విజయశర్మ.
సత్యనారాయణశర్మ గదిలోనికి వచ్చాడు.
"విజయ్!...."
"చెప్పండి మామయ్యా!...."
"మేము బయలుదేరుతాము నాన్నా!"
"మంచిది మామయ్యా!"
ముగ్గురూ హాల్లోకి వచ్చారు.
సయ్యద్ వచ్చి వరండాలో వున్నాడు.
అందరూ వరండాలోకి వచ్చారు.
సయ్యద్ గోపాల్ శర్మలు కారు డిక్కీలో సామాన్లను పెట్టారు. గోపాల్ శర్మ, విజయ్ శర్మను సమీపించాడు.
"వెళ్ళొస్తాం అన్నయ్యా!"
"మంచిది నాన్నా! బాగా చదువుకో. గొప్ప వాడివి కావాలి, నాన్నగారి పేరును నిలబెట్టాలి."
"అలాగే అన్నయ్యా!.... నన్ను ఆశీర్వదించండి" వంగి విజయశర్మ పాదాలను తాకాడు భాస్కరశర్మ.
కుడిచేతిని అతని తలపై వుంచి మనసారా దీవించాడు విజయశర్మ. భుజాలు పట్టుకొని అతన్ని లేవదీసి తన హృదయానికి హత్తుకొన్నాడు విజయశర్మ.
అందరూ కార్లో కూర్చున్నారు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. అది గమ్యం వైపుకు బయలుదేరింది.
చిత్తరువులా కన్నీటితో నిలబడిపోయాడు విజయ్ శర్మ. సయ్యద్ అతన్ని సమీపించాడు.
"విజయ్ బాబూ!....."
"మామా! అందరూ వెళ్ళిపోయారు. ఏకాకిగా మిగిలిపోయాను" అంతవరకూ హృదయంలో అణచిపెట్టుకొన్న ఆవేదన పొంగిపొరిలి భోరున ఏడ్చాడు.
సయ్యద్ విజయ్ భుజంపై చేయి వేసి....
"బాబూ!.... ఇదే జీవితం నీకు తెలియంది కాదు. అంతా ఋణానుబంధం. నీ చుట్టూ వున్న బంధాలన్నీ ఒక్కసారిగా విడిపోయాయి" విచారంగా చెప్పాడు సయ్యద్. తనపై కండువాతో విజయ్ కన్నీటిని తుడిచాడు.
ఇరువురూ కుర్చీలలో కూర్చున్నారు.
"మామా!...."
"ఏం అయ్యా!...."
"నాకూ ఈ స్థలానికి, వూరికి ఋణం తీరిపోయింది. నేను బయలుదేరుతాను."
"ఎక్కడికయ్యా!...."
"ముందు అరుణాచలం సర్వేశ్వరుల దర్శనం, శ్రీ రమణ భగవానుల ఆశ్రమ దర్శనం ఆపై...." ఆగిపోయాడు విజయ్.
"ఆపై...." ఆశ్చర్యంతో అడిగాడు సయ్యద్.
"జార్ఖండ్‍లో వున్న శ్రీ శంకర అద్వైతేంద్ర స్వాముల వారి ఆశ్రమంలో చేరాలి. నా శేష జీవితం అక్కడే గడపాలి మామా! అదే నా నిర్ణయం" స్వర నిశ్చలత్వంతో, ప్రశాంతమైన వదనంతో చెప్పాడు విజయ్ శర్మ.
క్షణం తర్వాత.... "సయ్యద్ మామా!... రుద్రమను, భాస్కర్‍ను అప్పుడప్పుడూ ఆ వూరికి వెళ్ళి చూడండి. వారికి కావలసిన సాయం చేయండి. ఈ ఇంటిలో మీకు ఉపయోగపడే సామానులు తీసుకోండి. మిగతా వాటిని పేదలకు పంచండి. తాళాలను ప్రిన్సిపాల్ గారికి ఇవ్వండి."
"అలాగే బాబూ!"
ఇంట్లోకి వెళ్ళి దేవుడి మందిరంలోని దైవాన్ని నమస్కరించి తన సూట్‍కేసును తీసుకొని బయటికి వచ్చాడు విజయ్.
తాళాలను సయ్యద్‍కు ఇచ్చాడు. సూట్ కేసును చేత పట్టుకొని బస్టాండు వైపుకు నడిచాడు. సయ్యద్ అతన్ని అనుసరించాడు. బస్సు రద్దీగా వుంది. సయ్యద్‍కి చెప్పి విజయ్ బస్సు ఎక్కాడు. అది బయలుదేరింది. విచారవదనంతో సయ్యద్ విజయ్‍కు వీడ్కోలు చెప్పాడు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



Comments